Arrest: కన్న పిల్లలపై మాజీ ఎమ్మెల్యే కుమారుడి నీచమైన పనులు.. స్నేహితుడితో కలిసి దారుణం.. పోక్సో చట్టం కింద కేసు!

|

Jul 26, 2021 | 8:40 PM

వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కన్నబిడ్డతోనే అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణల మేరకు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు.

Arrest: కన్న పిల్లలపై మాజీ ఎమ్మెల్యే కుమారుడి నీచమైన పనులు.. స్నేహితుడితో కలిసి దారుణం.. పోక్సో చట్టం కింద కేసు!
Follow us on

Ex MLA Son Misbehaving with his Daughter: వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కన్నబిడ్డతోనే అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణల మేరకు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు రిమాండుకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్ వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ జిల్లాలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ నాయకుడి కుమారుడు (45) విదేశాల్లో ఉద్యోగం చేసి.. కొన్నేళ్ల క్రితం విదేశాల నుంచి తిరిగొచ్చాడు. అప్పటినుంచి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నం.70లో భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. 2018లో భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తి ఇరువరి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. దీంతో భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆపై ఇద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.

భర్తతో వేరుగా ఉంటున్నప్పటి నుంచి పిల్లల ప్రవర్తనలో మార్పు వచ్చింది. 11 ఏళ్ల కుమారుడు,14 ఏళ్ల కుమార్తె ఎప్పుడూ దిగులుగా ఉంటున్నారు. ఇది గమనించిన తల్లి వారిని ఓ సైకాలజిస్టు వద్దకు తీసుకెళ్లి చూపించింది. సైకాలజిస్ట్ వారిని కౌన్సెలింగ్ చేస్తున్న సమయంలో 14 ఏళ్ల కుమార్తె సంచలన విషయాలు వెల్లడించింది. తన తండ్రి గతంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. తన తండ్రి ముందే అతని స్నేహితుడు సైతం తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపింది. అయినప్పటికీ తన తండ్రి అతన్ని ఏమీ అనేవాడు కాదని పేర్కొంది. కన్న తండ్రి అయినప్పటికీ అడ్డుకునే వాడు కాదని గోడు వెల్లబోసుకుంది.

కుమార్తె వెల్లడించిన విషయాలతో షాక్ తిన్న ఆ తల్లి.. జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా న్యాయస్థానం అతనికి రిమాండు విధించింది. దీంతో అతన్ని జైలుకు తరలించారు. ప్రస్తుతం అతని స్నేహితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు ఎమ్మెల్యే కుమారుడు అని చెబుతున్నప్పటికీ ఆ ఎమ్మెల్యే ఎవరనేది వెల్లడి కాలేదు. పోలీసులు సైతం ఆ వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read Also..  

AP High Court: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నిర్ణయంపై ఉత్కంఠ.. రేపు తీర్పు వెలువరించనున్న హైకోర్ట్