మామ కాదు..వాడు కామాంధుడు..కీచక వేధింపులు తాళలేక కోడలు…

|

Mar 06, 2020 | 8:52 AM

కూతురిలా చూసుకోవాల్సిన కోడలిపై కన్నేశాడు ఆ కీచక మామ. కోరిక తీర్చాలని కోడలి వెంటపడ్డాడు. విషయం ఎవరికి చెప్పినా అర్థం చేసుకోలేదు..తండ్రిలాంటి వాడమ్మ అంటూ సర్ది చెప్పారు. రోజులు గడిచినా మామ వక్రబుద్ధి మారలేదు. చివరకు కామాంధుడి వేధింపులు తాళలేక..

మామ కాదు..వాడు కామాంధుడు..కీచక వేధింపులు తాళలేక కోడలు...
Follow us on

మామ కాదు..వాడు కామాంధుడు.. కూతురిలా చూసుకోవాల్సిన కోడలిపై కన్నేశాడు ఆ కీచక మామ. కోరిక తీర్చాలని కోడలి వెంటపడ్డాడు. విషయం ఎవరికీ చెప్పిన అందరూ అర్థం చేసుకోలేదు..తండ్రిలాంటి వాడమ్మ అంటూ సర్ది చెప్పారు. రోజులు గడిచినా మామ వక్రబుద్ధి మారలేదు. చివరకు కామాంధుడి వేధింపులు తాళలేక కోడలు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…

బషీర్‌బాగ్‌లోని పూల్‌ బాగ్‌కు చెందిన యువతి, లోయర్‌ ట్యాంక్‌బండ్, గాంధీనగర్‌కు చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. ఇరుకుటుంబాల్లోని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఏడాదిన్నర క్రితం వివాహం కాగా…ఈ మధ్యే వీరికి పాప కూడా పుట్టింది. అత్తాపూర్‌లోని ఓ ఐస్‌క్రీం షాప్‌లో డెలివరీబాయ్‌గా పనిచేస్తున్నాడు ఆమె భర్త. ఈ క్రమంలోనే ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంపై భర్త తండ్రి కన్నుపడింది. కోడలిపై కన్నేసిన మామ ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తర్వాత కొద్దిసేపటికి ఆమె కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి చూడగా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. తలుపులు బలంగా కొట్టి లోనికి వెల్లి ఆమెను దింపగా అప్పటికే మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్నిఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.