Constable Sucide: కార్ఖానాలో విషాదం.. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

|

Jul 19, 2021 | 8:26 AM

ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఓ పోలీసు కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది

Constable Sucide: కార్ఖానాలో విషాదం.. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Suicide
Follow us on

ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఓ పోలీసు కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చూపులతో మానసిక ఒత్తిడికి గురైన ఓ కానిస్టేబుల్‌ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కార్ఖానా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కదిరికి చెందిన లక్ష్మి కుటుంబం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి, కార్ఖానా న్యూ వాసవినగర్‌లో స్థిరపడింది. ఆమె కుమారుడు దండగల ఆంజనేయులు(25) ఏఆర్‌ కానిస్టేబుల్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఇటీవల అంజనేయులు వివాహం చేసేందుకు కుటుంబసభ్యలు సిద్ధమయ్యారు. ఇష్టం లేకపోయినప్పటికీ ఇటీవల పెద్దల సమక్షంలో అతనికి పెళ్లి చూపులు జరిపించారు. దీంతో మానసిక వేదనకు గురవుతున్నాడు. ఇటు కుటుంబసభ్యులను ఒప్పించలేక, తన మనసు అంగీకరించక తీవ్ర మనోవేధనకు గురయ్యాడు.

కాగా, పింఛన్‌ తీసుకునేందుకు తల్లి శుక్రవారం స్వస్థలానికి వెళ్లగా.. ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. స్థానికంగా విక్రంపురి కాలనీలో ఉండే అతని సోదరి శనివారం ఫోన్‌ చేయగా.. నైట్‌ డ్యూటీ ఉందని చెప్పాడు. రాత్రి ఫోన్‌ చేయగా ఎంతకూ స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన సోదరి.. వరసకు సోదరుడైన క్రాంతిని ఆదివారం ఉదయం పంపింది. ఆంజనేయులు తలుపు తెరవకపోవడంతో.. స్థానికుల సాయంతో బద్దలుకొట్టి, ఇంట్లోకి వెళ్లి చూడగా ఉరేసుకొని కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అంజనేయులు ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also.. TS Inter Exams: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు ఏర్పాట్లు.. సమయం కుదింపు.!