కరోనా మహిళలను ఆర్థికంగా దెబ్బతీస్తుంది: ఐక్యరాజ్యసమితి

చైనాలో పురుడు పోసుకున్న కరోనా రాకాసి ప్రపంచవ్యాప్తంగా కల్లోలాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోయి రోడ్డునపడుతున్నారు. దీని ప్రభావం రానున్న రోజుల్లో మరింతగా ఎక్కువగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కరోనా మహిళలను ఆర్థికంగా దెబ్బతీస్తుంది: ఐక్యరాజ్యసమితి
Follow us

|

Updated on: Sep 04, 2020 | 4:15 PM

చైనాలో పురుడు పోసుకున్న కరోనా రాకాసి ప్రపంచవ్యాప్తంగా కల్లోలాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోయి రోడ్డునపడుతున్నారు. దీని ప్రభావం రానున్న రోజుల్లో మరింతగా ఎక్కువగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కరోనా వల్ల ఏర్పడ్డ పరిస్థితుల కారణాంగా 2021 నాటికి మహిళా పేదరికం పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక అంచనా వేసింది. అంతేకాకుండా రానున్న దశాబ్దకాలంలో పురుషుల కంటే మహిళలు ఆర్థికంగా వెనుకబడతారని తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

కరోనా మహమ్మారి మహిళలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం, యూఎన్‌ అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) వెల్లడించింది. 2021 నాటికి దాదాపు 4.7కోట్ల మంది మహిళలు, బాలికలు తీవ్ర పేదరికంలోకి వెళ్లే అవకాశం ఉందని యూఎన్‌డీపీ లెక్క కట్టింది. మహిళల విషయంలో గతకొన్ని దశాబ్దాలుగా సాధించిన పురోగతి కాస్త పూర్తిగా వెనక్కి వెళ్లే ఆస్కారం ఉందని తెలిపింది. ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతంలో ఈ పేదరిక వ్యత్యాసం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని యూఎన్‌డీపీ అభిప్రాయపడింది. ముఖ్యంగా 25 నుంచి 34 ఏళ్ల వయస్సు కలిగిన మహిళలు, అంతకంటే తక్కువ వయసు కలిగిన బాలికలు దుర్భర పరిస్థితిని ఎదుర్కోవల్సి రావచ్చని తెలిపింది.

కరోనా విజృంభణకు ముందు దక్షిణాసియాలో మహిళల పేదరికం రేటు దాదాపు 10శాతంగా అంచనా వేయగా ప్రస్తుతం అది 13శాతానికి పెరిగినట్లు తాజా నివేదికలో వెల్లడించింది. దక్షిణాసియాలో 2030 నాటికి మహిళా పేదరికం రేటు దాదాపు 15.8 శాతంగా ఉండవచ్చని, ప్రస్తుత పరిస్థితుల అనంతరం అది 18.6 శాతానికి పెరిగే అవకాశం ఉందన్నారు. వచ్చే ఏడాది నాటికి దాదాపు 9.6 కోట్ల మంది మహిళలకు పేదరికంలోకి నెట్టబడతారని, వీరిలో దాదాపు 4.7 కోట్ల మంది మహిళలు, బాలికలు ఉండనున్నట్లు అంతర్జాతీయ నివేదికలు అంచనా వేస్తున్నాయి.

కరోనా ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అన్ని రంగాల్లోనూ ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. ఇదీ మహిళల్లో పేదరికం పెరుగుదలకు కారణంగా యూఎన్‌డీపీ విశ్లేషించింది. ముఖ్యంగా మహిళలు తమ ఆదాయ వనరులను కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసింది. అందుకే ముందుజాగ్రత్తగా ప్రభుత్వాలు మేల్కొని లింగ భేదం లేకుండా ఉద్యోగ, ఉపాధి కల్పనల్లో మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. అంతేకాకుండా, మహిళలకు ఆర్థిక రక్షణ కల్పించే ప్రత్యేక విధానాలను తీసుకురావాలని, వారికి ఆర్థిక స్వాలంభన కల్పించాలని ప్రభుత్వాలకు యూఎన్‌డీపీ సూచించింది.