బెజ‌వాడ దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం త్వరలో..

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం భక్తుల దర్శనానికి రెడీ అవుతోంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. అయితే గతంలో లాగా అమ్మవారిని దర్శించుకోవడం మాత్రం అంత ఇప్పుడు ఈజీ కాదంటున్నారు అధికారులు.

బెజ‌వాడ దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం త్వరలో..
Follow us

|

Updated on: Jun 04, 2020 | 5:13 PM

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం భక్తుల దర్శనానికి రెడీ అవుతోంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. అయితే గతంలో లాగా అమ్మవారిని దర్శించుకోవడం మాత్రం అంత ఇప్పుడు ఈజీ కాదంటున్నారు అధికారులు. ఆన్‌లైన్ దర్శనం నుంచి ఉచిత ప్రసాదాల కౌంటర్ల వరకు అంతటా నిబంధనలు ఉంటాయి.

రూల్స్ పాటించాల్సిందే..

తిరుమల ఆలయం 8 నుంచి ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కానీ.. దుర్గమ్మ అనుగ్రహం కావాలంటే మాత్రం మరో రెండ్రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. భక్తులు అమ్మ ఆలయంలోకి ఎంట్రీ అయినప్పటి నుంచి దర్శనం చేసుకుని తిరిగి వెళ్లే వరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అలాగే ప్రతి భక్తుడిపై నిఘా కూడా ఉంచుతున్నారు. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న సంకేతాలు కూడా ఇస్తున్నారు.

క్యూలైన్స్‌లో సర్కిల్స్‌…

దుర్గమ్మ క్యూలైన్స్‌ దగ్గర నిబంధనలు పక్కాగా అమలయ్యేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. క్యూలైన్స్‌లో కేటాయించిన సర్కిల్స్‌లోనే భక్తులు నిల్చోవాల్సి ఉంటుంది. అమ్మ దర్శనం కోసం వచ్చే వారికి కరోనా జాగ్రత్తలు కూడా ఆలయ అధికారులు తీసుకున్నారు. ఆలయంలోకి ఎంట్రీ అయిన ప్రతి భక్తుడ్ని థర్మల్‌ పరీక్షిస్తారు. అలాగే ఎక్కడ అవసరమో… అక్కడ హ్యాండ్ శానిటైజర్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

స్పెషల్ పూజలు..

అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు ఆలయ ప్రాంగణంలో కొన్ని స్పెషల్ పూజలు కూడా చేయించేవారు. దాదాపు 10కి పైగా ప్రత్యేక పూజలు జరిగేవి. అయితే కరోనా నేపధ్యంలో పూజలు చేయించుకునే భక్తులు తప్పక లాక్‌డౌన్ రూల్స్ పాటించాల్సి ఉంటుంది. క్రౌడ్ లేకుండా పరిమిత సంఖ్యలోనే పూజలు జరిగేలా ఏర్పాట్లు చేశారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు