జూన్ 15న తెలంగాణ ఇంటర్ ఫలితాలు..!

ఈ నెల 15వ తేదీలోగా ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను విడుదల చేస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ వెల్లడించారు.

జూన్ 15న తెలంగాణ ఇంటర్ ఫలితాలు..!

Updated on: Jun 05, 2020 | 7:08 PM

ఈ నెల 15వ తేదీలోగా ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను విడుదల చేస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ వెల్లడించారు. ఇంటర్ బోర్డ్ హిందీ మహా విద్యాలయ ఆధ్వర్యంలో ఈ నెల 11న వెబినార్ నిర్వహిస్తున్నామని చెప్పిన ఆయన.. ఇప్పటికే 17 వేల మంది వెబినార్ కోసం అప్లై చేసుకున్నారని తెలిపారు. మరో లక్ష మంది విద్యార్థులకు లింక్ పంపుతున్నామన్నారు. ఇక ఇంటర్ పరీక్ష పత్రాలు వాల్యుయేషన్ చేసినవారికి టీఏ, డీఏలను అందిస్తున్నామని.. అందుకే ఉచిత బస్సు సౌకర్యం కల్పించలేదని స్పష్టం చేశారు. కాగా, ఎగ్జామినర్లకు రేపటిలోగా డబ్బులను చెల్లిస్తామన్నారు. కాగా, కరోనా కారణంగా వాయిదా పడిన టెన్త్ పరీక్షలు జూన్ 8 నుంచి జూలై 5 వరకు జరగనున్నాయి. ఉదయం 9. 30 నుంచి 12.15 నిమిషాల వరకు పరీక్షలు జరగనుండగా.. ప్రతీ పరీక్షకు రెండు రోజులు గ్యాప్ ఇచ్చారు.

ఇది చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. శ్రీకాళహస్తిలో దర్శనాలకు నో ఎంట్రీ!

Loading...
Unable to load recommendations.
Follow Us