శ్రీలంకలో కరోనా వస్తే.. ఆరు నెలల జైలు శిక్షే

| Edited By:

Mar 16, 2020 | 6:41 PM

శ్రీలంకలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉండి దాచిపెడితే కనుక.. ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా..

శ్రీలంకలో కరోనా వస్తే.. ఆరు నెలల జైలు శిక్షే
Follow us on

శ్రీలంకలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉండి దాచిపెడితే కనుక.. ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి ఐదు వేల మందికి పైగా మరణించారు. దీంతో తమ దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు శ్రీలంక ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంది. వైరస్ ప్రభావిత దేశాల నుంచి శ్రీలంకకు వస్తోన్న ప్రయాణికులను క్యారంటైన్ సెంటర్లకు తరలిస్తోంది. కానీ కొందరు ప్రయాణికులు మాత్రం క్యారెంటైన్లకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారని, అలాంటి వారిని ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్ట్ చేస్తామని శ్రీలంక డీఐజీ అజిత్ రోహన్ ప్రకటించారు.

వీరి ద్వారానే కరోనా వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని ఈమేరకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. క్యారంటైన్ నిబంధనల గురించి ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు దేశ వ్యాప్తంగా ఒక్కో పోలీస్ స్టేషన్‌కు ఏడుగురు అధికారులను నియమించామని చెప్పారు. కాగా.. శ్రీలంకలో ఇప్పటి దాకా 18 కరోనా కేసులు నమోదయ్యాయని.. వారందరికీ కొలంబో నగర శివార్లలో ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని.. ఆయన తెలిపారు.

Read More this also: సీఎం జగన్‌పై నాగబాబు సెటైర్స్!

సిల్వర్ స్క్రీన్‌పై ‘కరోనా’ మూవీ

ఫ్లూ, జలుబు, కరోనాల మధ్య తేడాలు ఇవే!

రోజా టైమింగ్‌కి దిమ్మ తిరగాల్సిందే!

అవకాశం కోసం వెళ్తే.. ఓ నిర్మాత పడకగదికి రమ్మన్నాడు: హీరోయిన్ సంచలన కామెంట్స్..