“బంపర్ ఆఫర్” ప్రకటించిన రాయల్ ఎన్‌ఫీల్డ్‌

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వినియోగదారులు షోరూం వరకు రావల్సిన అవసరం లేదని చెప్పింది. మీ ఇంటి వద్దకే వచ్చి మోటార్‌ సైకిళ్లకు సర్వీస్ చేస్తానంటోంది. కరోనా వ్యాప్తి...

బంపర్ ఆఫర్ ప్రకటించిన రాయల్ ఎన్‌ఫీల్డ్‌

Updated on: Jul 29, 2020 | 4:09 PM

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వినియోగదారులు షోరూం వరకు రావల్సిన అవసరం లేదని చెప్పింది. మీ ఇంటి వద్దకే వచ్చి మోటార్‌ సైకిళ్లకు సర్వీస్ చేస్తానంటోంది. కరోనా వ్యాప్తి చెందుతుండంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం‘సర్వీస్‌ ఆన్‌ వీల్స్‌’ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌ షిప్‌ల పరిధిలో ఈ సేవలను అందించడానికి 800 మోటార్‌ సైకిళ్లను ఏర్పాటు చేసింది.

తెలంగాణలో 65 మోటార్‌ సైకిళ్ల ద్వారా ఈ సేవలందించనున్నట్లు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ లలిత్‌ మాలిక్‌ వెల్లడించారు. ప్రత్యేకంగా రూపొందించిన మోటార్‌ సైకిళ్లలో విడిభాగాలు, మరమ్మతు చేసే పరికరాలు ఉంటాయి. 80 శాతం వరకూ అన్ని రకాల రిపేర్లను ఇంటి వద్దే చేయడానికి వీలుంటుందని అన్నారు.

షెడ్యూల్‌ మెయింటినెన్స్‌, చిన్న, చిన్న మరమ్మతులు, కీలకమైన విడిభాగాల మార్పిడి అన్నీ ఇంటి వద్దే చేయించుకోవచ్చని తెలిపారు. వినియోగదారులు ఈ సేవలు పొందడానికి సమీప డీలర్‌ను కలుసుకోవాలని కోరింది. అయితే ఇప్పటికే చాలా మోటర్ వెహికిల్ కంపెనీలు ఇలాంటి సేవలను అందిస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us