కరోనా ఓడించాలంటే ఇలా చేయాల్సిందే.. కేంద్రానికి రాహుల్ టిప్స్‌..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 26వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ప్రస్తుతం 19వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా.. 800 మందికి పైగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పలు సూచనలు చేశారు. నోవల్ కరోనా మహమ్మారిని ఓడించాలంటే.. రోజుకు కనీసం […]

కరోనా ఓడించాలంటే ఇలా చేయాల్సిందే.. కేంద్రానికి రాహుల్ టిప్స్‌..
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2020 | 6:26 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 26వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ప్రస్తుతం 19వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా.. 800 మందికి పైగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పలు సూచనలు చేశారు. నోవల్ కరోనా మహమ్మారిని ఓడించాలంటే.. రోజుకు కనీసం 1లక్ష కరోనా టెస్టులు చేయాలని కేంద్రానికి సూచించారు. ఆదివారం ఆయన పోస్ట్ చేసిన ఓ ట్వీట్‌లో.. కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే మాస్‌ రాండమ్‌ టెస్టింగ్స్ చాలా ఇంపార్టెంట్‌ అని.. దీనిని నిపుణులు కూడా అంగీకరిస్తున్నారంటూ పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రోజుకు 40 వేల కరోనా పరీక్షలు జరుగుతున్నాయని.. దీనిని 1లక్షకు పెంచేందుకు ప్రయత్నించాలన్నారు. దీనికి వస్తున్న అడ్డంకుల్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం తొలగించాలని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా టెస్టులు నిర్వహించేందుకు కిట్లు కూడా అందుబాటులోనే ఉన్నాయని.. ప్రధాని నరేంద్ర మోదీనే యాక్టివ్‌గా వ్యవహరించి కరోనా టెస్టులు ఎక్కువ చేసేలా ప్రయత్నించాలంటూ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మే 3వ తేదీన లాక్‌డౌన్ ముగియనుంది. అయితే ఇంకా అనేక చోట్ల కరోనా వైరస్ అదుపులోకి రాకపోవడంతో.. లాక్‌డౌన్ కొనసాగించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మే 7 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Latest Articles
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 ఏళ్లుగా ఆ విషయంలో విఫలమవుతోన్న ధోని.. అదేంటంటే?
16 ఏళ్లుగా ఆ విషయంలో విఫలమవుతోన్న ధోని.. అదేంటంటే?
అడవుల్లో మండుతున్న మంటలు.. పర్యావరణానికి పొంచి ఉన్న ప్రమాదం..
అడవుల్లో మండుతున్న మంటలు.. పర్యావరణానికి పొంచి ఉన్న ప్రమాదం..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం చూస్తే షాక్
ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం చూస్తే షాక్
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!
రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!
పిచ్చి పరాకాష్టకు చేరింది..! వెరైటీ కోసం ప్రాణాలు రిస్క్‌లోపెట్టి
పిచ్చి పరాకాష్టకు చేరింది..! వెరైటీ కోసం ప్రాణాలు రిస్క్‌లోపెట్టి