క్వారంటైన్ సెంటర్ లో ‘క్రికెట్ మ్యాచ్’! చూడాల్సిందే !

| Edited By: Pardhasaradhi Peri

Jun 10, 2020 | 8:12 PM

క్వారంటైన్ సెంటర్ అంటే ఎలా ఉండాలి ? కరోనా రోగులకు సదా వైద్య సేవలు అందుతుండాలి.. ప్రతి 48 గంటల కొకసారి వారికి వైద్య పరీక్షలు జరుగుతుండాలి..

క్వారంటైన్ సెంటర్ లో క్రికెట్ మ్యాచ్! చూడాల్సిందే !
Follow us on

క్వారంటైన్ సెంటర్ అంటే ఎలా ఉండాలి ? కరోనా రోగులకు సదా వైద్య సేవలు అందుతుండాలి.. ప్రతి 48 గంటల కొకసారి వారికి వైద్య పరీక్షలు జరుగుతుండాలి.. కానీ జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పోస్ట్ చేసిన ఓ వీడియోను చూస్తే ఆశ్చర్యపోవలసిందే. ఓ క్వారంటైన్ సెంటర్లో ముఖాలకు మాస్కులు ధరించిన రోగులు క్రికెట్ ‘మ్యాచ్’ ఆడుతూ కనిపిస్తారు. ‘హావ్ స్పేస్.. విల్ ప్లే’ అని ఒమర్ అబ్దుల్లా దీనికి ఓ కామెంట్ కూడా పెట్టారు. అయితే ఈ వీడియో ఎక్కడిదో, ఏ ప్రాంతంలోనిదో ఆయన తెలియజేయలేదు. ఇటీవల బీహార్ లోని ఓ క్వారంటైన్ సెంటర్ లో 1997 నాటి ‘బోర్డర్’ సినిమాలోని  ఓ పాటకు రోగులు డ్యాన్స్ చేసిన ఉదంతాన్ని మరువలేం.