హీరోలు నాని, సుధీర్ బాబులు కలిసి నటించిన ‘వి’ సినిమా విడుదల వాయిదా పడింది. కరోనా వైరస్ నేపథ్యంలో సినిమాను వాయిదా వేసినట్టు నిర్మాతలు వెల్లడించారు. ఈ నెల 25న విడుదల కావాల్సిన ‘వి’ సినిమా.. ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు కావడంతో.. రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా థియేటర్లు, స్కూళ్లను బంద్ చేయనున్నారు.
తాజాగా.. కరోనా ఎఫెక్ట్ కారణంగా.. థియేటర్ల నిలిపివేతపై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ సమావేశమయ్యింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆదేశిస్తే.. థియేటర్లు మూసివేస్తామని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్ మురళీ మోహన్ తెలిపారు. కరోనాపై రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అలర్ట్ ప్రకటించారు. అలాగే ప్రజలు గుంపులు గుంపులుగా తిరగవద్దని, తగిన జాగ్రత్తలు, సూచనలు పాటించాలని పేర్కొన్నారు.
Read More this also: శభాష్ రోజమ్మా.. నీ టైమింగ్‌కి!
‘కరోనా’ రావడం మంచిదేనా? ఆ వైరస్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా!
రోజా ‘రచ్చబండ’కు దొరబాబు దంపతులు
షాకింగ్ న్యూస్: ఆస్ట్రేలియా క్రికెటర్‌కి కరోనా వైరస్..!
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడాలనుకుంటున్నారా? ఈ ట్రిక్ యూజ్ చేయండి