ఇల్లు చేరుకోవడానికి కూలీ మాస్టర్ ప్లాన్.. 25 వేల కేజీల ఉల్లితో..

|

Apr 26, 2020 | 2:17 PM

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ.. ఓ వ్యక్తి ఏకంగా ముంబై నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్‌కు చేరుకున్నాడు. ఈ కరోనా కాలంలో ఇంటి పక్కన ఉన్న షాపుకు వెళ్లాలంటే అనేక ఆంక్షలు ఉన్నాయి. అలాంటిది 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయడమేంటి అని అనుకుంటున్నారా.? అసలు అతడు ఎలా ఇంత దూరం ప్రయాణం చేసి ఇంటికి చేరుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళ్తే ముంబై ఎయిర్‌పోర్టులో పనిచేసే ప్రేమ్ మూర్తి పాండే.. లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఇరుక్కుపోయాడు. అతడు […]

ఇల్లు చేరుకోవడానికి కూలీ మాస్టర్ ప్లాన్.. 25 వేల కేజీల ఉల్లితో..
Follow us on

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ.. ఓ వ్యక్తి ఏకంగా ముంబై నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్‌కు చేరుకున్నాడు. ఈ కరోనా కాలంలో ఇంటి పక్కన ఉన్న షాపుకు వెళ్లాలంటే అనేక ఆంక్షలు ఉన్నాయి. అలాంటిది 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయడమేంటి అని అనుకుంటున్నారా.? అసలు అతడు ఎలా ఇంత దూరం ప్రయాణం చేసి ఇంటికి చేరుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

వివరాల్లోకి వెళ్తే ముంబై ఎయిర్‌పోర్టులో పనిచేసే ప్రేమ్ మూర్తి పాండే.. లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఇరుక్కుపోయాడు. అతడు అంధేరీలోని ఆజాద్ నగర్ అనే ఇరుకైన ప్రాంతంలో నివసిస్తున్నాడు. అక్కడ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో కేంద్రం ఇచ్చిన సడలింపులను తన ఇంటికి చేరుకోవడానికి చాలా తెలివిగా ఉపయోగించుకున్నాడు. మొదటగా మూర్తి ముంబై నుంచి పింపాగావ్ వరకు నడిచాడు. ఇక అక్కడ అతడు 1300 కేజీల పుచ్చాకాయలను కొనుగోలు చేశాడు. అయితే వాటిని అమ్మేసి.. స్థానిక మార్కెట్‌ను ఒకసారిగా పరిశీలించగా.. ఉల్లిపాయల అమ్మకానికి గిరాకీ బాగా ఉందని మూర్తికి అర్ధమైంది.

అందుకే సుమారు 2 లక్షలు ఖర్చు చేసి 25,520 కేజీల ఉల్లిపాయలను కొనుగోలు చేశాడు. అక్కడే ఓ ట్రక్ రూ.77,500కు ఏప్రిల్ 20న అద్దెకు తీసుకుని తన స్వస్థలం ప్రయాగ్రాజ్‌కు పయనమయ్యాడు. ఇక కూరగాయలు అత్యవసర వస్తువుల కావడంతో ఆ ట్రక్ ఎంతో ఈజీగా అన్ని చెక్ పాయింట్లను దాటేసింది. దీనితో ఏప్రిల్ 23న మూర్తి తన ఇంటికి చేరుకున్నాడు. స్థానిక మార్కెట్‌కు చేరుకొని ఉల్లిపాయలను మంచి ధరకు అమ్మాలని మూర్తి ప్రయత్నించగా.. అంత డబ్బులు పెట్టి కొనేందుకు వ్యక్తులు ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. దీనితో చేసేది ఏమి లేక తన ఇంటి వద్ద లోడ్ దిమ్పించి ట్రక్‌ను వెనక్కి పంపించేశాడు. కాగా, మూర్తికి టీపీ నగర్ పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండాలంటూ సూచించారు.

ఇవి చదవండి:

డేంజర్ బెల్స్: మే 18 వరకు లాక్ డౌన్ పొడిగింపు..!

మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..

పంచాయతీ ఉద్యోగులకు తీపికబురు.. ఇకపై ప్రతీ నెలా రూ. 8500..

నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ మరణించాడట.. అసలు దీనిలో నిజమెంత.!

షాకింగ్: కటింగ్ షాపుకు వెళ్లిన ఆరుగురికి కరోనా.!

కరోనాకు సిగరెట్‌తో చెక్ పెట్టగలమా.. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే.!

విషాదకర ఘటన: కన్నబిడ్డను తాకకుండానే కరోనాతో తల్లి మృతి..

ఆర్‌సీబీని విడిచిపెట్టనుః కోహ్లీ

అదిరిపోయే ఆఫర్.. ఇంటి పట్టునే ఉంటే ఒక కోడి, పది కోడిగుడ్లు ఫ్రీ..

ట్రెండింగ్: కరోనాను మించిపోయిన కిమ్.. అసలు ఏమయ్యాడు.?

తెలంగాణవాసులకు గుడ్ న్యూస్.. కరోనా ఫ్రీ జిల్లాగా సంగారెడ్డి..