లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. ఐదు రూపాయలకే భోజనం..!

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో.. కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యల్లో భాగంగా.. మూడు వారాలపాటు (ఏప్రిల్14వరకు) దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ప్రజలకు కావాల్సిన నిత్యవసర సరకులను.. పలుచోట్ల ప్రభుత్వమే డోర్‌ డెలివరీ చేస్తోంది. ఇక కేవలం అత్యవసర పరిస్థితులైతేనే బయటకు రావాలని హెచ్చరిస్తోంది. మధ్య తరగతి ప్రజలకు రోజు ఆహారానికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం […]

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. ఐదు రూపాయలకే భోజనం..!
Follow us

| Edited By:

Updated on: Apr 08, 2020 | 10:04 PM

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో.. కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యల్లో భాగంగా.. మూడు వారాలపాటు (ఏప్రిల్14వరకు) దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ప్రజలకు కావాల్సిన నిత్యవసర సరకులను.. పలుచోట్ల ప్రభుత్వమే డోర్‌ డెలివరీ చేస్తోంది. ఇక కేవలం అత్యవసర పరిస్థితులైతేనే బయటకు రావాలని హెచ్చరిస్తోంది. మధ్య తరగతి ప్రజలకు రోజు ఆహారానికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఐదురూపాయలకే భోజనం పెట్టాలని నిర్ణయించింది. గతంలో.. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల శివ భోజన తాలీని.. రూ.10కి అందించేవారు. అయితే కరోనా నేపథ్యంలో ఈ శివ భోజనాన్ని.. రూ.5కే అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా.. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వెయ్యికి పైగా కేసులు నమోదవ్వడంతో.. ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.