మరో వారంలో 15 అంతస్తుల కరోనా ఆస్పత్రి సిద్ధం..

| Edited By:

Apr 07, 2020 | 5:16 PM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు ముస్లింలు వెళ్లివచ్చిన తరువాత నుంచి కరోనా కేసులు మరింత ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్.. కరోనా కట్టడికి కఠినమైన చర్యలు తీసుకుంటూ..

మరో వారంలో 15 అంతస్తుల కరోనా ఆస్పత్రి సిద్ధం..
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు ముస్లింలు వెళ్లివచ్చిన తరువాత నుంచి కరోనా కేసులు మరింత ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్.. కరోనా కట్టడికి కఠినమైన చర్యలు తీసుకుంటూ.. వైద్య సదుపాయాలను కూడా పెంచుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కరోనా పాజిటివ్ బాదితుల కోసం భారీ ఆస్పత్రిని సిద్ధం చేస్తున్నారు.. సీఎం కేసీఆర్. స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన కాంప్లెక్స్‌ను పూర్తిగా కరోనా ఆస్పత్రిగా మార్చుతున్నారు. పదిహేను అంతస్తుల్లో ఉన్న భవనంలో 1500 పడకల ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. మరిన్ని కరోనా కేసులు ఎక్కువ అవ్వొచ్చని.. సోమవారం స్వయంగా సీఎం కేసీఆరే చెప్పడంతో ఆస్పత్రికి సంబంధించి పనులు మరింత త్వరగా చేపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆస్పత్రి ఏర్పాటు పనులు ఎలా జరుగుతున్నాయో.. పరీక్షించేందుకు తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించారు. పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు మరింత వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఏప్రిల్ 15 లోగా హాస్పిటల్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 364కి చేరగా.. 11 మంది మరణించారు. ఇవాళ ఒక్కరోజే 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే మరో 12 మంది కరోనా పేషంట్లు ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

ఇవి కూడా చదవండి:

చేతల్లోకి దిగండంటూ.. సీఎంపై గౌతమ్ గంభీర్ ఫైర్

హైదరాబాద్‌ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తొలి కరోనా కేసు

ఇంకో వంద కరోనా కేసులు పెరగొచ్చు: సీఎం కేసీఆర్

బ్రేకింగ్: లాక్‌డౌన్‌ని కొనసాగించాలని ప్రధానిని కోరుతున్నా

సొంతూరికి వెళ్లడానికి శవం గెటప్.. ఐదుగురిపై కేసు

గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా రోగి’ అదృశ్యం.. అసలేం జరిగిందంటే!