ఛత్తీస్‌గఢ్‌లో తెలుగు విద్యార్థుల ఇక్కట్లు.. ఆకలి కేకలు..

ఛత్తీస్‌గఢ్‌లో కబీర్‌ధాం జిల్లాలో తెలుగు విద్యార్థుల ఇక్కట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇటలీ నుంచి ఢిల్లీ ఐటీబీపీ క్వారంటైన్ సెంటర్‌కి చేరుకున్నారు. అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు బయల్దేరారు విద్యార్థులు. ఇటలీ నుంచి తీసుకొచ్చి క్వారంటైన్..

ఛత్తీస్‌గఢ్‌లో తెలుగు విద్యార్థుల ఇక్కట్లు.. ఆకలి కేకలు..
Follow us

| Edited By:

Updated on: Apr 12, 2020 | 3:37 PM

ఛత్తీస్‌గఢ్‌లో కబీర్‌ధాం జిల్లాలో తెలుగు విద్యార్థుల ఇక్కట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇటలీ నుంచి ఢిల్లీ ఐటీబీపీ క్వారంటైన్ సెంటర్‌కి చేరుకున్నారు. అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు బయల్దేరారు విద్యార్థులు. ఇటలీ నుంచి తీసుకొచ్చి క్వారంటైన్ చేసింది కేంద్రం. దాదాపు నెల రోజులుగా క్వారంటైన్ సెంటర్లో ఉన్నారు విద్యార్థులు. కొత్తగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేవారి కోసం ఖాళీ చేయించారు అధికారులు. ట్రాన్సిట్-పాస్ రాసిచ్చి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. బస్సు మాట్లాడుకుని అనుమతి పత్రంతో బయల్దేరిన విద్యార్థులకు ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో చిల్పి వద్ద బస్సును ఆపివేశారు అధికారులు. ట్రాన్సిట్ పాస్ ఉన్నా ఎందుకు ఆపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. రాత్రి నుంచి ఆకలితో జిల్లా కలెక్టర్ అనుమతి కోసం పడిగాపులు కాస్తున్నారు. జిల్లా కలెక్టర్ చెబితే తప్ప బస్సును వదిలేది లేదంటున్నారు స్థానిక అధికారులు. దీంతో అక్కడే ఉండి నరక యాతన అనుభవిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఇకపై రోడ్డు మీదకొస్తే.. ఇలా పట్టుకుంటారు

ఫ్లాష్‌న్యూస్: ఏప్రిల్ 30 వరకూ రాష్ట్రంలో లాక్‌డౌన్‌

జబర్దస్త్ నుంచి వాళ్లిద్దరినీ తప్పించనున్న మల్లెమాల టీం?

ఫేస్‌బుక్ వ్యసనానికి.. ఫేస్‌బుక్కే మందు కనిపెట్టింది

లాక్ డౌన్‌పై మనసులో మాట బయటపెట్టిన జగన్..!