తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల..కొత్తగా నమోదైన కేసులు..

తెలంగాణలో కరోనా వైరస్ వణికిస్తోంది. గత కొద్ది రోజులుగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దీంతో జిల్లాల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగానే నమోదు అవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల..కొత్తగా నమోదైన కేసులు..

Updated on: Jul 29, 2020 | 10:40 AM

తెలంగాణలో కరోనా వైరస్ వణికిస్తోంది. గత కొద్ది రోజులుగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దీంతో జిల్లాల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగానే నమోదు అవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు నమోదైన కరోనా కేసుల బులిటెన్ విడుదల చేసింది ప్రభుత్వం.

తెలంగాణలో కొత్తగా 1764 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58,906కు చేరింది.  మంగళవారం 842 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం 43,751 మంది డిశ్చార్జ్ అయ్యారు. 14,663 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం 12 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 492కు చేరింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 18,858 కరోనా టెస్టులు చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us