ఆ చాయ్.. హెచ్ఐవీ డ్రగ్స్ కంటే బెటర్.. కరోనాను కట్టడి చేస్తుంది

తేనీరు ఇప్పుడు కరోనా ఔషధంగా పనిచేస్తోంది. అవును. అయితే అది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కంగ్రా లోయలో పండించే ఓ రకం తేయాకు మాత్రమే ప్రత్యేక ఔషధ గుణాలను కలిగి ఉందని పరిశోధనల్లో వెల్లడైంది. ‘కంగ్రా టీ’ లోని రసాయనాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయని, యాంటీ-హెచ్‌ఐవీ ఔషధాల కంటే కరోనా వైరస్‌ను మరింత సమర్థవంతంగా అడ్డుకోగలవని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ బయోరిసోర్స్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ డా. సంజయ్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లోని పలంపూర్‌లో […]

ఆ చాయ్.. హెచ్ఐవీ డ్రగ్స్ కంటే బెటర్.. కరోనాను కట్టడి చేస్తుంది

Edited By:

Updated on: May 23, 2020 | 8:14 PM

తేనీరు ఇప్పుడు కరోనా ఔషధంగా పనిచేస్తోంది. అవును. అయితే అది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కంగ్రా లోయలో పండించే ఓ రకం తేయాకు మాత్రమే ప్రత్యేక ఔషధ గుణాలను కలిగి ఉందని పరిశోధనల్లో వెల్లడైంది. ‘కంగ్రా టీ’ లోని రసాయనాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయని, యాంటీ-హెచ్‌ఐవీ ఔషధాల కంటే కరోనా వైరస్‌ను మరింత సమర్థవంతంగా అడ్డుకోగలవని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ బయోరిసోర్స్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ డా. సంజయ్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లోని పలంపూర్‌లో ఉంది. అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ నిర్వహించిన వెబినార్‌లో ఈ విషయాన్ని డా. కుమార్‌ వెల్లడించారు. సవరించిన ప్రొటోకాల్‌ ప్రకారం, భారత వైద్య పరిశోధన మండలి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి, వైరస్‌ వృద్ధిని అడ్డుకోవడానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సీక్యూ)ను యాంటీ-హెచ్‌ఐవీ ఔషధాలతో భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే యాంటీ –హెచ్ఐవీ డ్రగ్స్ కంటే కంగ్రా టీ మరింత సమర్థవంతంగా కరోనా వైరస్ వృద్ధిని అడ్డుకుంటుందని గుర్తంచారు.

కంగ్రా టీ వల్ల సమాజానికి, పరిశ్రమకు కలిగే ప్రయోజనాలు, మానవ ఆరోగ్యానికి టీ లోని ఔషధ గుణాలు చేసే మేలు, కొవిడ్‌-19ను ఎదుర్కోవడానికి ఐహెచ్‌బీటీ వృద్ధి చేసి బదిలీ చేసిన సాంకేతికత పరిజ్ఞానం గురించి తన ప్రసంగంలో డా. కుమార్‌ వివరించారు. కంప్యూటర్‌ ఆధారిత మోడళ్ల ద్వారా శాస్త్రవేత్తలు 65 బయోయాక్టివ్‌ లేదా పాలీఫెనాల్స్ ను పరీక్షించారని ఆయన వెల్లడించారు. కరోనా రోగులకు చికిత్స చేయడానికి అనుమతించిన వాణిజ్యపరమైన యాంటీ-హెచ్‌ఐవీ ఔషధాల కంటే, ప్రత్యేకమైన వైరల్‌ ప్రొటీన్‌ను ఇవి ప్రభావవంతంగా అడ్డుకుంటాయని తెలిపారు. మానవ కణాల్లో వైరస్‌ వృద్ధికి సాయపడే వైరల్‌ ప్రొటీన్‌ను నిరోధిస్తాయని డా. కుమార్‌ వివరించారు. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)లో ఐహెచ్‌బీటీ కూడా ఓ భాగం. తేయాకు సారం, సహజ సుగంధ నూనెలు కలిగిన ఆల్కాహాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్లను తన సాంకేతిక భాగస్వాముల ద్వారా ఐహెచ్‌బీటీ ఉత్పత్తి చేసి, పంపిణీ చేస్తోంది. తేయాకు సారం, సహజ సపోనిన్స్‌తో కూడిన మూలికా సబ్బును కూడా ఐహెచ్‌బీటీ వృద్ధి చేసింది. సోడియం లారేత్ సల్ఫేట్, సోడియం డోడేసిల్‌ సల్ఫేట్‌, మినరల్‌ నూనెలు లేకుండా ఈ సబ్బును తయారు చేశారు. ఇది ఫంగస్‌, బాక్టీరియాలను దరి చేరనివ్వకుండా, పరిశుభ్రత, తేమ ప్రయోజనాలను అందిస్తుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని రెండు సంస్థలు ఈ సబ్బులను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నాయి.

“టీ క్యాటెచిన్స్‌ను ఉత్పత్తి చేసి ప్రక్రియను బైధ్యనాథ్‌ ఫార్మాస్యూటికల్స్‌ సంస్థకు బదిలీ చేశాం. టీ, టీ వైన్‌ మార్కెట్‌లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది కంగ్రా టీ చరిత్రనే మార్చేస్తుంది” అని డా. కుమార్‌ చెప్పారు. క్యాటెచిన్లు సహజ యాంటీ-ఆక్సిడెంట్లు. ఇవి కణ విచ్ఛిన్నాన్ని నివారించడంతో పాటు, ఇతర ప్రయోజనాలను అందిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా, టీ వెనిగర్‌ సాంకేతికతను ధర్మశాలలోని ఓ సంస్థకు బదిలీ చేశారు. టీ వెనిగర్‌లో ఊబకాయ నిర్మూలన గుణాలున్నాయి. ‘ఆయుష్’ సిఫారసు చేసిన మూలికలు కలిపిన హెర్బల్ గ్రీన్, బ్లాక్ టీలను కూడా ఆవిష్కరించారు. కొవిడ్‌-19ని అడ్డుకునేందుకు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ఉత్పత్తులు ఉపయోగకరంగా ఉంటాయని ఐహెచ్‌బీటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Mahatma Kodiyar
TV9, Senior Journalist