Coronavirus News Live Updates : దేశంలో 24 గంటల్లో 12,689 మందికి కరోనా నిర్ధారణ.. 137 మంది మృతి

ఓ వైపు కరోనా వైరస్ నివారణ కోసం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. మరోవైపు దేశంలో కరోనా వైరస్ కేసుల నమోదు నిలకడగా కొనసాగుతుంది. గత 24గంటల్లో 12, 689 కొత్త పాజిటివ్ కేసులు..

Coronavirus News Live Updates : దేశంలో 24 గంటల్లో 12,689 మందికి కరోనా నిర్ధారణ.. 137 మంది మృతి
Follow us

|

Updated on: Jan 27, 2021 | 10:53 AM

Indian Coronavirus: ఓ వైపు కరోనా వైరస్ నివారణ కోసం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. మరోవైపు దేశంలో కరోనా వైరస్ కేసుల నమోదు నిలకడగా కొనసాగుతుంది. గత 24గంటల్లో 12, 689 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య సిబ్బంది తెలిపింది. అంతేకాదు ఒక్కరోజే 13,320 మంది కోలుకున్నారని ఈ రోజు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. దేశంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,89,527కు చేరుకుంది. మొత్తం ఇప్పటి వరకూ 19,36,13,120 కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. ఇక గత 24గంటల్లో 5,50,426 శాంపిళ్లను పరీక్షించమని పేర్కొంది. ఇక మరోవైపు జనవరి 16 నుంచి చేపట్టిన తొలిదశ టీకా కార్యక్రమంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 20,29,480 మందికి వ్యాక్సిన్లు వేశారు. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ను ఎగుమతి చేస్తూనే మన దేశంలో రెండో దశ లో వ్యాక్సిన్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

Also Read: