తెలంగాణలో మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ సర్వీసులకు భారీ స్పందన

తెలంగాణలో మొబైల్ టెస్టింగ్‌ ల్యాబ్‌ వెహికల్‌కి భారీ స్పందన లభిస్తోంది. ఐదు వాహనాలతో ఐదు లొకేషన్లలో టెస్టింగ్‌లు చేస్తున్నారు.

తెలంగాణలో మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ సర్వీసులకు భారీ స్పందన
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2020 | 11:34 AM

Mobile Testing Lab Vehicles Telangana: తెలంగాణలో మొబైల్ టెస్టింగ్‌ ల్యాబ్‌ వెహికల్‌కి భారీ స్పందన లభిస్తోంది. ఐదు వాహనాలతో ఐదు లొకేషన్లలో టెస్టింగ్‌లు చేస్తున్నారు. ఈ రోజు మెహదీపట్నం, జాఫర్ గూడా, ఖాదర్ భాగ్‌లలో టెస్ట్‌లు నిర్వహించనున్నారు. పరీక్షలు చేయించుకోవాలనుకునే వారు ఆధార్ కార్డ్‌, మొబైల్ నెంబర్‌, అడ్రస్‌ ప్రూఫ్‌లను తీసుకొని వెళ్లాలి. 24 గంటల్లో మొబైల్ ఫోన్ నెంబర్‌కి మెసేజ్ ద్వారా ఈ టెస్ట్ ఫలితాలు అందనున్నాయి.

కాగా రెండు రోజుల క్రితం హైద‌రాబాద్‌లోని కోటి క‌మాండ్ కంట్రోల్ రూమ్‌లో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్‌ వెహికల్స్‌ని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో ఒకేసారి 10 మంది నుంచి నమూనాలు తీసుకునే అవకాశం ఉంది. ఒక్కో బస్సుకున్న పది కౌంటర్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Read This Story Also: కూర్చొని కాదు పడుకొని భోజనం చేస్తున్నా: నెటిజన్‌కి అభిషేక్ రిప్లై