క‌రోనా ఎఫెక్ట్: జైల్లో ఉన్న ఖైదీల‌ను విడుద‌ల చేయాలని హైకోర్టులో పిల్‌..

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా కోవిడ్ తీవ్రంగా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అందులోనూ ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు, వైద్యులు, పోలీసు సిబ్బంది, ప‌లువురు ప్ర‌ముఖ న‌టులు ఈ వైర‌స్ బారిన ప‌డ‌టంతో.. ప్ర‌జ‌లు మ‌రింత భ‌యాందోళ‌న‌ల‌కు గురవుతున్నారు. ఇక అలాగే జైల్లో కూడా ప‌లువురు ఖైదీల‌కు...

క‌రోనా ఎఫెక్ట్: జైల్లో ఉన్న ఖైదీల‌ను విడుద‌ల చేయాలని హైకోర్టులో పిల్‌..
Follow us

| Edited By:

Updated on: Jul 13, 2020 | 12:27 PM

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా కోవిడ్ తీవ్రంగా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అందులోనూ ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు, వైద్యులు, పోలీసు సిబ్బంది, ప‌లువురు ప్ర‌ముఖ న‌టులు ఈ వైర‌స్ బారిన ప‌డ‌టంతో.. ప్ర‌జ‌లు మ‌రింత భ‌యాందోళ‌న‌ల‌కు గురవుతున్నారు. ఇక అలాగే జైల్లో కూడా ప‌లువురు ఖైదీల‌కు క‌రోనా వైర‌స్ పాజిటివ్ వ‌స్తున్న‌ట్లు ప‌లు వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఈ త‌రుణంలో జైల్లో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని హైకోర్టులో పిల్ దాఖ‌ల‌య్యింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జైల్లో ఉన్న ఖైదీల‌ను విడుద‌ల చేయాలంటూ పిల్‌లో పేర్కొన్నారు పిటిష‌న‌ర్ లింగ‌య్య‌. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో పెరోల్‌పై ఖైదీల‌ను విడుద‌ల చేస్తున్నార‌ని, తెలంగాణ‌లో కూడా విడుద‌ల చేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు పిటిష‌న‌ర్. ఈ పిల్‌ను స్వీక‌రించిన హైకోర్టు మ‌రికొద్దిసేప‌ట్లో విచార‌ణ చేయ‌నుంది.

ఇక తెలంగాణలో ఆదివారం 1,269 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో నిన్న‌ 8 మంది చనిపోయారు. ఇప్పటివరకూ 34 వేల 671 కేసులు నమోదు కాగా 356 మంది చనిపోయారు. ఇంకా 11, 883 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో తాజాగా 1,563 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 22,482 మంది డిశ్చార్జి అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆదివారం 800 మంది కరోనా బారిన పడ్డారు.

Read More: బ్రేకింగ్: ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు క‌రోనా..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..