ఖమ్మం కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిగా రేణుకా చౌదరి

తెలంగాణ కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిని ఏఐసీసీ ఖరారు చేసింది. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి గారపాటి రేణుకా చౌదరికి టికెట్ కేటాయించారు. రెండు విడతలుగా తెలంగాణ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కాంగ్రెస్.. ఖమ్మం సీటును పెండింగ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. రేణుకా చౌదరితో పాటు పోట్ల నాగేశ్వరరావు, గాయత్రి రవిల పేర్లను కూడా కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు కథనాలు రావడంతో ఖమ్మం సీటును కాంగ్రెస్ ఎవరికి దక్కుతుందా? అన్న ఆసక్తి నెలకొంది. […]

ఖమ్మం  కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిగా రేణుకా చౌదరి
Follow us

| Edited By:

Updated on: Mar 23, 2019 | 11:02 AM

తెలంగాణ కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిని ఏఐసీసీ ఖరారు చేసింది. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి గారపాటి రేణుకా చౌదరికి టికెట్ కేటాయించారు. రెండు విడతలుగా తెలంగాణ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కాంగ్రెస్.. ఖమ్మం సీటును పెండింగ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. రేణుకా చౌదరితో పాటు పోట్ల నాగేశ్వరరావు, గాయత్రి రవిల పేర్లను కూడా కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు కథనాలు రావడంతో ఖమ్మం సీటును కాంగ్రెస్ ఎవరికి దక్కుతుందా? అన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో రేణుకా చౌదరి ఖమ్మం లో పోటీకి తగిన నాయకురాలు అని భావించిన యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ , ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమెను ఖరారు చేసి ప్రకటించారు. ఈ 25 న రేణుకా చౌదరి ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.

కాగా 1994,2004 లోక్‌సభ ఎన్నికల్లో రేణుకా చౌదరి ఖమ్మం నుంచి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఓటమిపాలయ్యారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు ఖమ్మం బరిలో మరోసారి తలపడబోతున్నారు. అయితే గతంలో లాగే ఈసారి కూడా రేణుకా చౌదరి కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతుండగా.. నామా మాత్రం ఈసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్‌ను ఇంతవరకు కైవసం చేసుకోని టీఆర్ఎస్.. ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు రేణుకా చౌదరి కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండటంతో.. ఖమ్మంలో గెలుపెవరిది అన్న దానిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!