Breaking News
  • విశాఖలో లైట్‌మెట్రోకు డీపీఆర్‌లు రూపొందించాలని ఆదేశాలు. ఏఎంఆర్సీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ. 79.91 కిలోమీటర్ల మేర లైట్‌మెట్రోకు ప్రతిపాదనలు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీ నుంచి సలహాలు తీసుకోవాలని ఆదేశం. 60.2 కి.మీ. మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్స్ ఏర్పాటుకు డీపీఆర్‌లు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీల నుంచి డీపీఆర్‌లు ఆహ్వానించాలని ఆదేశం.
  • నిర్భయ దోషులను విడివిడిగా ఉరితీయాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ. ఇప్పటికే తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం. రేపు తీర్పు ఇవ్వనున్న జస్టిస్‌ భానుమతి నేతృత్వంలోని.. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.67 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 46,448 మంది భక్తులు.
  • విశాఖ: పాయకరావుపేటలో హెటిరో ఉద్యోగి ఒంటెద్దు రాజు ఉరి వేసుకుని ఆత్మహత్య, మృతుడు తూ.గో.జిల్లా పెదపట్నం లంక వాసి.
  • ఢిల్లీ చేరుకున్న ట్రంప్‌ దంపతులు. ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్‌ దంపతులకు ఘనస్వాగతం. ఐటీసీ మౌర్య హోటల్‌లో ట్రంప్‌ దంపతుల బస. ఢిల్లీలో భారీగా భద్రతా ఏర్పాట్లు. ట్రంప్‌ బస చేసిన హోటల్‌ దగ్గర పటిష్ట భద్రత.

బచావో ర్యాలీ.. బడావో ఛాన్సెస్..సూపర్ ప్లాన్ బాసూ !

telangana congress leaders efforts, బచావో ర్యాలీ.. బడావో ఛాన్సెస్..సూపర్ ప్లాన్ బాసూ !

ఛాన్స్ వస్తే చాలు పార్టీ అధిష్టానం మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తుంటారు అన్ని పార్టీల రాజకీయ నాయకులు. కాంగ్రెస్ పార్టీలో అయితే ఈ ట్రెండ్ మరీ ఎక్కువ. తాజాగా ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారత్ బచావో కార్యక్రమం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు భలేగా ఉపయోగపడింది.

దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందన్న డిమాండ్‌తో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపుతో శనివారం ఢిల్లీలోని రామ్‌లీల మైదాన్‌లో భారీ ర్యాలీ జరిగింది. గాంధీ కుటుంబం మొత్తం హాజరై కాంగ్రెస్ శ్రేణులనుద్దేశించి ఉత్తేజ పూరితమైన ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ.. తాను ‘‘ రాహుల్ సావర్కర్‌ని కాదని రాహుల్ గాంధీ’’ నంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రేప్ ఇన్ ఇండియా కామెంట్లను తాను వెనక్కి తీసుకోనని, కనీసం క్షమాపణ కూడా చెప్పబోనని రాహుల్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. మరోవైపు సోనియా, ప్రియాంకా వధేరాలు కూడా కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరిచే ప్రసంగాలు చేశారు.

ఇదంతా కాయిన్‌కు ఒకవైపే.. మరోవైపు ఈ ర్యాలీని తెలంగాణ నేతలు ఎలా ఉపయోగించుకున్నారనేదే ఇపుడు ఆసక్తి రేపుతోంది. టీపీసీసీ అధ్యక్షుని మార్పు త్వరలోనే జరుగుతుందన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ నేతలు భారత్ బచావో ర్యాలీకి తమ అనుచర వర్గాన్ని, అభిమానులను పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలించి, అక్కడ తమ సందడితో కాంగ్రెస్ పెద్దల నజర్‌లో పడేందుకు తెగతంటాలు పడ్డారని సమాచారం.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి తన అనుచర వర్గాన్ని భారీ ఎత్తున తరలించి, జాతీయ మీడియా దృష్టిలో పడేందుకు యత్నించారని, పలు మార్లు ఢిల్లీలో వున్న తెలుగు మీడియా వారితో మాట్లాడుతూ పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు యత్నించారని సమాచారం. రేవంత్ రెడ్డితోపాటు ఉత్తమ్ కుమార్, వి.హనుమంతరావు, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ తదితరులు తమ బలాన్ని ప్రదర్శించేందుకు భారత్ బచావో ర్యాలీని ఉపయోగించుకున్నారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

అయితే, చివరి నిమిషంలో సత్తా చాటే వారికే పట్టం కట్టే నైజం వున్న కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నేతల యత్నాలను ఏ మేరకు పరిశీలిస్తుందో వేచి చూడాలి.

Related Tags