స్వ‌స్థ‌లం సూర్యాపేటలోనే కల్న‌ల్ సంతోష్​ అంత్యక్రియలు..

భారత్‌ - చైనా సరిహద్దులో సోమ‌వారం చైనా బలగాలతో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో కల్న‌ల్‌ సంతోష్‌బాబు వీర‌మ‌ర‌ణం పొంద‌డం దేశం మొత్తాన్ని క‌న్నీరు పెట్టించింది. దేశ ర‌క్ష‌ణ‌లో కల్న‌ల్ స్థాయి తెలుగు సైనిక అధికారి చనిపోవడం ఇదే తొలిసారి అని మాజీ సైనికాధికారులు చెబుతున్నారు.

స్వ‌స్థ‌లం సూర్యాపేటలోనే కల్న‌ల్ సంతోష్​ అంత్యక్రియలు..
Follow us

|

Updated on: Jun 17, 2020 | 9:19 AM

భారత్‌ – చైనా సరిహద్దులో సోమ‌వారం చైనా బలగాలతో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో కల్న‌ల్‌ సంతోష్‌బాబు వీర‌మ‌ర‌ణం పొంద‌డం దేశం మొత్తాన్ని క‌న్నీరు పెట్టించింది. దేశ ర‌క్ష‌ణ‌లో కల్న‌ల్ స్థాయి తెలుగు సైనిక అధికారి చనిపోవడం ఇదే తొలిసారి అని మాజీ సైనికాధికారులు చెబుతున్నారు.

కాగా మంగ‌ళ‌వారం రాత్రి సంతోష్​బాబు భౌతికకాయం ఆర్మీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్​ హకీంపేటకు చేరుకుంది. బుధ‌వారం ఆయన స్వస్థలం సూర్యాపేటలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియలకు ప‌లువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు, అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. మధ్యాహ్నం వరకు భౌతికకాయం సూర్యాపేటకు చేరుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్య‌క్రియ‌లు జ‌ర‌ప‌నున్న‌ట్లు సమాచారం. కాగా 2004లో లెఫ్టినెంట్‌ హోదాలో సైన్యంలో చేరిన సంతోష్​బాబు 15 ఏళ్ల సర్వీసులో అంచెలంచెలుగా ఎదిగి నాలుగుసార్లు ప్ర‌మోష‌న్స్ పొంది ప్రస్తుతం కల్న‌ల్ ‌ ర్యాంకులో దేశానికి సేవలందిస్తూ వీర‌మ‌ర‌ణం పొందారు.

ఇండియా-చైనా మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను దిగువ వీడియోలో చూడండి…