ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల కేసులో దూకుడు పెంచిన సీఐడీ

ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు వ్యవహారంపై దూకుడు సీఐడీ పెంచింది. మొన్న కోటి రూపాయలు నగదు, 5 కేజీల బంగారం, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రగుంట్ల, ఖాజీపేట మండలాల్లోని ఆయన అనుచరులు, బంధువుల ఇళ్లు, గోడౌన్స్‌, ఆఫీసుల్లో ఆదివారం సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల కేసులో దూకుడు పెంచిన సీఐడీ
Follow us

|

Updated on: Aug 23, 2020 | 4:46 PM

ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు వ్యవహారంపై దూకుడు సీఐడీ పెంచింది. మొన్న కోటి రూపాయలు నగదు, 5 కేజీల బంగారం, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రగుంట్ల, ఖాజీపేట మండలాల్లోని ఆయన అనుచరులు, బంధువుల ఇళ్లు, గోడౌన్స్‌, ఆఫీసుల్లో ఆదివారం సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

గుజ్జల మీద ఫోకస్ పెట్టిన నేపథ్యంలో… సిఐడి అధికారులు గుజ్జల శ్రీనివాసులు కు సంబంధించి మరికొంత మంది బంధువులు, అనుచరుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. బోగస్ సోసైటీల పేరుతో భారీ స్ధాయిలో అవినితీ అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగంపై ఆప్కో మాజీ చెర్మెన్ గుజ్జల శ్రీనివాస్‌తోపాటు అనుచరులు, బంధువుల ఇళ్లల్లో వరుసగా సీబీసీఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. కోర్టు ఉత్తర్వులు, చేనేత సంఘం నేతల ఫిర్యాదు మేరకు సీబీసీఐడీ అధికారులు రంగంలోకి దిగారు.

అటు, కడపజిల్లా ప్రొద్దుటూరు సాంబయ్య గారి వీధిలో మల్లికార్జున ఇంట్లో సి.ఐ.డి అధికారుల సోదాలు నిర్వహించారు…కొద్దీ రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్ లో మల్లికార్జున చికిత్స పొందుతున్నట్లు వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు… అక్కడి నుంచి కూడా కొన్ని కీలక డాక్యుమెంట్లు స్వాదినం చేసుకున్నారని సమాచారం. ఎక కాలంలో సోదాలు నిర్వహించిన సీబీసీఐడి అధికారులు కీలక డాక్యుమెంట్లతో పాటు బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

గత ప్రభుత్వం హయాంలో ఆప్కోలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టిన సీబీసీఐడి అధికారులు తోలుత కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన నివాసంలో దాడులు చేశారు. ఆ వెంటనే ప్రొద్దుటూరు లోని ఆయన అనుచరులు కొండయ్య, మల్లికార్జున, శ్రీరాములు ఇళ్లపై అధికారుల బృందాలు దాడులు చేశారు. ఆప్కో కుంభకోణానికి సంబంధించి పలు కీలక పత్రాలు, నగదు, ఇతర డాక్యుమెంట్లును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దర్యాప్తు వివరాలను వెల్లడించేందుకు సీబీసీఐడీ అధికారులు నిరాకరించారు. ఆప్కోలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు ను వేగవంతం చేసిన అధికారులు తుది నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో