మోటార్ బోట్లలో వచ్చి పరారయ్యారు, చైనా సేనల దూకుడుపై ఇండియన్ ఆర్మీ

లడాఖ్ లోని పాంగాంగ్ సరస్సు పశ్చిమ ప్రాంతానికి చైనా దళాలు ఈ నెల 8 న మోటారు బోట్లలో వచ్చారని, అయితే భారత జవాన్లను చూసి పరారయ్యారని సైనికవర్గాలు తెలిపాయి.

మోటార్ బోట్లలో వచ్చి పరారయ్యారు, చైనా సేనల దూకుడుపై ఇండియన్ ఆర్మీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 10, 2020 | 11:49 AM

లడాఖ్ లోని పాంగాంగ్ సరస్సు పశ్చిమ ప్రాంతానికి చైనా దళాలు ఈ నెల 8 న మోటారు బోట్లలో వచ్చారని, అయితే భారత జవాన్లను చూసి పరారయ్యారని సైనికవర్గాలు తెలిపాయి. 25 నుంచి 50 మంది సైనికులు ఛుషుల్ లోని ముఖేర్ పరి హిల్ ను ఆక్రమించుకునేందుకు వచ్చినట్టు తెలిసిందని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఫింగర్-3 ప్రాంతం వద్ద నిఘా కోసం ఏర్పాటు చేసిన పోస్ట్ లోని జవాన్లు వారి కదలికలను పసిగట్టినట్టు సైనికాధికారులు తెలిపారు. ఏమైనా అక్కడ నిఘాను మరింతపెంచినట్టు వారు చెప్పారు.