నేడు గుంటూరులో చంద్రబాబు రోడ్‌ షో

గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు గుంటూరులో రోడ్ షో నిర్వహించనున్నారు. రేపల్లె బహిరంగ సభ అనంతరం సాయం త్రం 5.30 గంటల సమయంలో హెలికాఫ్టర్‌ ద్వారా గుంటూరుకు సాయంత్రం 5.45కు చేరుకుంటారు. 6.15 నిమిషాల నుంచి 7.30 గంటల వరకు బృందావన్‌ గార్డెన్స్‌ ఎన్టీ ఆర్‌ స్టేడియం నుంచి జిన్నాటవర్‌ సెంటర్‌ వరకు రోడ్డు షో నిర్వహించనున్నారు. ఈ మార్గం మధ్యలో ఉన్న ప్రతి కూడలిలో 10 నిమిషాల పాటు చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం 7.30 […]

నేడు గుంటూరులో చంద్రబాబు రోడ్‌ షో
Follow us

|

Updated on: Mar 23, 2019 | 8:55 AM

గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు గుంటూరులో రోడ్ షో నిర్వహించనున్నారు. రేపల్లె బహిరంగ సభ అనంతరం సాయం త్రం 5.30 గంటల సమయంలో హెలికాఫ్టర్‌ ద్వారా గుంటూరుకు సాయంత్రం 5.45కు చేరుకుంటారు. 6.15 నిమిషాల నుంచి 7.30 గంటల వరకు బృందావన్‌ గార్డెన్స్‌ ఎన్టీ ఆర్‌ స్టేడియం నుంచి జిన్నాటవర్‌ సెంటర్‌ వరకు రోడ్డు షో నిర్వహించనున్నారు.

ఈ మార్గం మధ్యలో ఉన్న ప్రతి కూడలిలో 10 నిమిషాల పాటు చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం 7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు మాయాబజార్‌ వద్ద జరిగే బహిరంగ సభలో ప్రసంగింస్తారు. ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాలతో పాటు, బహిరంగసభ ఏర్పాట్లను టీడీపీ జిల్లా నేతలు పరిశీలించారు. సభకు హాజరయ్యే కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.