ఆన్‌లైన్‌ విద్యా వ్యవస్ధలోకి ఐఐటీలు, ఐఐఎంలు..?

ఇటీవలే కొత్త విద్యా విధానాన్ని ఆవిష్కరించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ విద్యావ్యవస్థలో పెను మార్పులను అమలు చేయబోతోంది. ఐఐటీలు, ఐఐఎంలను ఆన్‌లైన్‌ విద్యా వ్యవస్ధ కిందకు తీసుకురావాలని యోచిస్తోన్న

ఆన్‌లైన్‌ విద్యా వ్యవస్ధలోకి ఐఐటీలు, ఐఐఎంలు..?
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2020 | 8:22 PM

ఇటీవలే కొత్త విద్యా విధానాన్ని ఆవిష్కరించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ విద్యావ్యవస్థలో పెను మార్పులను అమలు చేయబోతోంది. ఐఐటీలు, ఐఐఎంలను ఆన్‌లైన్‌ విద్యా వ్యవస్ధ కిందకు తీసుకురావాలని యోచిస్తోన్న ప్రభుత్వం ఈ దిశగా యూజీసీ, ఏఐసీటీఈ నుంచి సూచనలను కోరుతోంది. విద్యార్ధులకు భౌతికంగా క్లాసులను నిర్వహించే భారాన్ని విద్యా సంస్ధలకు తగ్గించే దిశగా మొత్తం విద్యా వ్యవస్ధను ఆన్‌లైన్‌ విద్యా వ్యవస్థగా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. తొలుత ఉన్నత విద్యాసంస్ధలైన ఐఐటీలు, ఐఐఎంలను ఆన్‌లైన్‌ విద్యా వ్యవస్ధ కిందకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

పిఎంఓ, నీతి ఆయోగ్ ఈ విషయంలో యుజిసి, ఎఐసిటిఇ అభిప్రాయాలు, సలహాలను కోరింది.దీనికి సంబంధించి బ్లూప్రింట్‌ను తయారుచేసేందుకు ఏఐసీటీఈ చీఫ్‌ అనిల్‌ సహస్రబుధే, యూజీసీ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎంపి పునియాల నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆన్‌లైన్‌ విద్యకు అవసరమైన పటిష్ట మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపైనా వీరు కసరత్తు సాగిస్తారు. మరోవైపు చైనా యాప్‌లకు దీటుగా యాప్స్‌ను తయారుచేయాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ ఇటీవల ఐఐటీలను కోరారు.

Read More:

తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు.. 9మంది మృతి!

ఆగస్టు 16 నుంచి వైష్ణోదేవి యాత్ర..  ఆంక్షలతో..!