నడిరోడ్డుపై నటుడి వీరంగం..చితకొట్టిన స్థానికులు

Kannada actor Huccha Venkat thrashed by mob for allegedly damaging car in Kodagu, నడిరోడ్డుపై నటుడి వీరంగం..చితకొట్టిన స్థానికులు

ఓ నటుడు నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. అందరూ చూస్తుండగానే వింతగా ప్రవర్తిస్తూ.. వాహనాన్ని ధ్వంసం చేశాడు. చివరికి స్థానికులచేత తన్నులు తిన్నాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం కొడగులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

కన్నడ నటుడు హుచ్చా వెంకట్‌ కొడగు జిల్లాలోని ఓ హోటల్‌కు వెళ్లాడు. అక్కడ ఉన్న స్థానికులు నటుడు వచ్చాడంటూ ఎగబడి చూశారు. ఇది నచ్చని వెంకట్‌ హోటల్‌ నుంచి రోడ్డుపైకి వచ్చి అక్కడున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనంతరం అక్కడే ఉన్న ఓ కారుపై రాళ్లు విసిరి అద్దాలు పగలకొట్టాడు. కారు డోర్‌నూ ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. వెంకట్‌ వింత ప్రవర్తనను చూసి స్థానికులు అతడిని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నటుడిని అదుపులోకి తీసుకున్నారు.
హుచ్చా వెంకట్‌ కన్నడలో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. కన్నడలో ప్రసారమయ్యే బిగ్‌బాస్‌-3లో పాల్గొన్నారు.

Kannada actor Huccha Venkat thrashed by mob for allegedly damaging car in Kodagu, నడిరోడ్డుపై నటుడి వీరంగం..చితకొట్టిన స్థానికులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *