TSPSC: నిరుద్యోగులకు గమనిక! తెలంగాణ గ్రూప్-4 రిక్రూట్‌మెంట్‌లో ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులున్నాయో తెలుసా..
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదలవ్వనుంది. ఆయా శాఖల్లో ఏయే పోస్టులున్నాయంటే..
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదలవ్వనుంది. ఈమేరకు ఇప్పటికే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దాదాపు 25 శాఖల్లోని 91 విభాగాల్లో ఖాళీగా ఉన్న 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, పురపాలక శాఖలో 1,862 వార్డు ఆఫీసర్ పోస్టులు, ఆర్థికశాఖలో జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 191, పురపాలకశాఖలో 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, ఆడిట్‌శాఖలో 18 మంది జూనియర్ ఆడిటర్ పోస్టుల నియామకాలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఈ ఉద్యోగాలన్నింటినీ టీఎస్పీయస్సీ నిర్వహించే నియామక పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.