TSPSC Group I Hall Tickets 2022: తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల.. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి..

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష - 2022కు సంబంధించిన హాల్‌ టికెట్లు ఈ రోజు విడుదలయ్యాయి. గ్రూప్‌ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు..

TSPSC Group I Hall Tickets 2022: తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల.. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి..
TSPSC Group I Prelims Hall Tickets

Updated on: Oct 09, 2022 | 5:37 PM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష – 2022కు సంబంధించిన హాల్‌ టికెట్లు ఈ రోజు విడుదలయ్యాయి. గ్రూప్‌ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవల్సిందిగా కమిషన్‌ సూచించింది. ముందుగా ప్రకటించిన విధంగానే హాల్‌టికెట్లను కమిషన్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. కాగా మొత్తం 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గానూ దాదాపు 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్ట్‌కు ఏకంగా 756 మంది పోటీపడుతున్నారన్నమాట. ఇంతటి పోటీ నెలకొన్న సందర్భంగా టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షలను చాలా పకట్బందిగా నిర్వహించనుంది. అక్టోబర్‌ 16న నిర్వహించనున్న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రిలిమ్స్‌ పరీక్ష ముగిసిన తర్వాత జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.