TSPSC DL Jobs 2023: తెలంగాణ డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ వాయిదా.. మళ్లీ ఎప్పట్నుంచంటే..

తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 544 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ మంగళవారం (జనవరి 31) ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా..

TSPSC DL Jobs 2023: తెలంగాణ డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ వాయిదా.. మళ్లీ ఎప్పట్నుంచంటే..
TSPSC

Updated on: Jan 31, 2023 | 9:31 PM

తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 544 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ మంగళవారం (జనవరి 31) ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 544 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు (లెక్చరర్లు), ఫిజికల్‌ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీయస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు నేటి (జనవరి 31) నుంచి ప్రారంభంకానుంది. ఐతే కొన్ని కారణాల రిత్యా ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్పీయస్సీ అధికారులు తెలిపారు. కళాశాల విద్యా శాఖలో ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు కూడా ఫిబ్రవరి 15 నుంచే దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు నిరుద్యోగులకు సూచిస్తూ కమిసన్‌ ప్రకటన జారీ చేసింది.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల వివరాలు..

  • ఇంగ్లీష్ పోస్టులు: 23
  • తెలుగు పోస్టులు: 27
  • ఉర్దూ పోస్టులు: 2
  • సంస్కృతం పోస్టులు: 5
  • స్టాటిస్టిక్స్‌ పోస్టులు: 23
  • మైక్రో బయాలజీ పోస్టులు: 5
  • బయో టెక్నాలజీ పోస్టులు: 9
  • అప్లైడ్ న్యూట్రిషన్ పోస్టులు: 5
  • కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్స్ పోస్టులు: 311
  • బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులు: 39
  • కామర్స్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌ పోస్టులు: 8
  • డైరీ సైన్స్ పోస్టులు: 8
  • క్రాప్‌ ప్రొడక్షన్‌ పోస్టులు: 4
  • డేటా సైన్స్ పోస్టులు: 12
  • ఫిషరీస్ పోస్టులు: 3
  • కామర్స్‌-విదేశీ వాణిజ్యం పోస్టులు: 1
  • కామర్స్‌ ట్యాక్సేషన్‌ పోస్టులు: 6
  • ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు: 29

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us