TGSRTC Hall Tickets 2026: ఆర్టీసీలో సూపర్‌వైజర్‌ ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల.. డైరెక్ట్ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

TGSRTC TST and MST 2026 Hall Tickets Released: ఆర్టీసీలో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ (టీఎస్‌టీ), మెకానికల్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ (ఎంఎస్‌టీ) పోస్టుల భర్తీకి ఇటీవల తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 198 ట్రాఫిక్ సూపర్‌వైజర్, మెకానికల్ సూపర్‌వైజర్..

TGSRTC Hall Tickets 2026: ఆర్టీసీలో సూపర్‌వైజర్‌ ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల.. డైరెక్ట్ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
TSRTC Hall Tickets

Updated on: Mar 22, 2026 | 7:30 AM

హైదరాబాద్, మార్చి 22: తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ (టీఎస్‌టీ), మెకానికల్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ (ఎంఎస్‌టీ) పోస్టుల భర్తీకి ఇటీవల తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 198 ట్రాఫిక్ సూపర్‌వైజర్, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. మొత్తం పోస్టుల్లో 84 ట్రాఫిక్ సూపర్‌వైజర్ (టీఎస్‌టీ) పోస్టులు, 114 మెకానికల్ సూపర్‌వైజర్ ట్రెయినీ (ఎంఎస్‌టీ) పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగియగా తాజాగా రాత పరీక్ష కోసం హాల్ టికెట్లను తెలంగాణ పోలీస్ నియామక మండలి (TSLPRB) విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి హాట్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేయడంలో ఇబ్బందులు ఎదురైతే support@tslprb.inకు ఈ-మెయిల్‌ చేయవచ్చు. లేదంటే 9391005006 నంబర్‌ను సంప్రదించవచ్చని బోర్డు తెలిపింది. హాల్‌ టికెట్‌పై ఫొటో లేని అభ్యర్ధులను పరీక్షకు అనుమతించబోమని పేర్కొన్నారు. పరీక్ష సమయంలో అభ్యర్థుల వేలిముద్రలు, డిజిటల్‌ ఫొటోలను సేకరిస్తారు. కాబట్టి చేతులకు మెహందీ, టాటూలు ఉండకూడదని బోర్డు స్పష్టంచేసింది.

టీజీఎస్‌ఆర్టీసీ సూపర్‌వైజర్‌ ఉద్యోగాల హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇక మార్చి 29వ తేదీన రాత పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు. పరీక్షను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడత ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, రెండో విడత మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు తమ హాల్‌ టికెట్లను మార్చి 23వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మార్చి 28వ తేదీ అర్ధరాత్రి వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26,160 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇందులో 20,097 మంది 84 టీఎస్‌టీ పోస్టులకు, 6,063 మంది 114 ఎంఎస్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వీందరికీ మార్చి 29వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ తదితరాల ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.27,080 నుంచి రూ.81,400 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతన వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ చెక్‌ చేసుకోండి.

టీజీఎస్‌ఆర్టీసీ సూపర్‌వైజర్‌ ఉద్యోగాల హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us