TS DOST Admissions 2022: నేటి నుంచి దోస్త్‌ మూడో రౌండ్‌ స్పాట్‌ అడ్మిషన్లు.. ఆ విద్యార్ధులు స్కాలర్‌షిప్‌కు అనర్హులు!

తెలంగాణ ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌, ప్రైవెట్ ఎయిడెడ్ కాలేజీల్లో ఈ రోజు (నవంబర్‌ 29) నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు-రౌడ్‌ 3 ప్రారంభంకానున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్ లింబాద్రి ప్రకటించారు..

TS DOST Admissions 2022: నేటి నుంచి దోస్త్‌ మూడో రౌండ్‌ స్పాట్‌ అడ్మిషన్లు.. ఆ విద్యార్ధులు స్కాలర్‌షిప్‌కు అనర్హులు!
TS DOST Admissions 2022

Updated on: Nov 29, 2022 | 10:57 AM

తెలంగాణ ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌, ప్రైవెట్ ఎయిడెడ్ కాలేజీల్లో ఈ రోజు (నవంబర్‌ 29) నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు-రౌడ్‌ 3 ప్రారంభంకానున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్ లింబాద్రి ప్రకటించారు. ఈ మేరకు షెడ్యూల్‌ కూడా విడుదల చేశారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్‌సైల్‌లో కాలేజీల లిస్టును చెక్‌ చేసుకోవచ్చు. ఈ కాలేజీలు/ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు ప్రభుత్వ స్కాలర్‌షిప్‌/ఫీజు రీఎంబర్స్‌మెంట్‌లకు అనర్హులు. అప్షన్లు ఇచ్చుకున్న విద్యార్ధులకు సీట్ల కేటాయింపు వివరాలను రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఫోన్‌ నంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ లేదా వాట్సప్‌కు పంపించడం జరుగుతుందని ఉన్నత విద్యామండలి వివరించింది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us