TIMS Gachibowli Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, గచ్చిబౌలికి చెందిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (TIMS, Gachibowli) ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. జనరల్, టీబీసీడీ, రేడియో డయాగ్నసిస్, అనెస్థీషియా విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు
మొత్తం ఖాళీల సంఖ్య: 113
ఖాళీల వివరాలు:
ప్రొఫెసర్: 9
అసోసియేట్ ప్రొఫెసర్లు: 21
అసిస్టెంట్ ప్రొఫెసర్లు: 23
మెడికల్ ఆఫీసర్లు: 60
పే స్కేల్: నెలకు ఈ కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు.
ప్రొఫెసర్: రూ.1,90,000
అసోసియేట్ ప్రొఫెసర్లు: రూ.1,50,000
అసిస్టెంట్ ప్రొఫెసర్లు: రూ.1,25,000
మెడికల్ ఆఫీసర్లు: రూ.40,270 ల చొప్పున చెల్లిస్తారు.
అర్హతలు: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీతోపాటు నోటిఫికేషన్లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధులకు 18 నుంచి 34 ఏళ్లలోపు వయసుండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తును ఈ www.dme.telangana.gov.in. &
www.timshyd.telangana.gov.in. సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, ఫిల్ చేసి ఇతర డాక్యుమెంట్లతోపాటు ఇంటర్వ్యూ రోజున తీసుకుని రావాలి.
ఇంటర్వ్యూ తేదీ: జనవరి 27 నుంచి 29 వరకు, 2022. ఈ తేదీల్లో రంగారెడ్డి జిల్లాలోని గచ్చిబౌలిలో ఉన్న టిమ్స్ నందు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: