
హైదరాబాద్, జూన్ 2: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అదిరిపోయే తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE), అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
మొత్తం మూడు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా 290 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు TGPSC సెక్రటరీ ఎం. హరిత ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
టీజీపీఎస్సీ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు ఆన్ లైన్ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు జులై 1, 2026 నాటికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే 44 ఏళ్లకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
టీజీపీఎస్సీ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు ఆన్ లైన్ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ సందర్శించి ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, సిలబస్, పరీక్షా విధానం వంటి పూర్తి వివరాలతో కూడిన సుదీర్ఘ నోటిఫికేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని కమిషన్ తెలిపింది. ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు ఇదొక సువర్ణావకాశం అని చెప్పవచ్చు.
టీజీపీఎస్సీ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు ఆన్ లైన్ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.