AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG TET 2026 Exam Dates: టెట్‌కు భారీగా తగ్గిన దరఖాస్తులు.. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయంటే?

TG TET June 2026 Exam Schedule: రాష్ట్ర టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్ జూన్‌ 2026) తొలి విడత ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈసారి టెట్‌కు దరఖాస్తులు భారీగా తగ్గాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,36,418 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది జనవరిలో జరిగిన టెట్‌కు 2,37,754 మంది దరఖాస్తు చేసుకున్నారు..

TG TET 2026 Exam Dates: టెట్‌కు భారీగా తగ్గిన దరఖాస్తులు.. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయంటే?
TG TET Exam Dates
Srilakshmi C
|

Updated on: May 04, 2026 | 4:08 PM

Share

హైదరాబాద్‌, మే 4: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్ జూన్‌ 2026) తొలి విడత ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈసారి టెట్‌కు దరఖాస్తులు భారీగా తగ్గాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,36,418 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది జనవరిలో జరిగిన టెట్‌కు 2,37,754 మంది దరఖాస్తు చేసుకోనున్నారు. అంటే ఈసారి టెట్ పరీక్షకు పోటీపడేవారు ఏకంగా 1,01,336 మంది తగ్గారు. మొత్తం దరఖాస్తుల్లో టెట్‌ పేపర్‌ 1 పరీక్షకు 32,779 మంది, పేపర్‌ 2 పరీక్షకు 86,305 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక 17,334 మంది రెండు పేపర్లు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి టెట్‌ పరీక్షకు ఇన్‌సర్వీస్‌ టీచర్లు 28,149 మంది దరఖాస్తు చేసుకున్నారు.

షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 9వ తేదీ నుంచి టెట్‌ హాల్‌ టికెట్లు విడుదల అవుతాయి. టెట్‌ పరీక్షలు జూన్‌ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. జులై 28 నుంచి 31 మధ్య ఫలితాలు వెల్లడిస్తారు. జూన్‌ 15 నుంచి 30వ తేదీ మధ్య జరిగే టెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో జరుగుతాయి. ఉదయం 9 నుంచి 11.30 వరకు మొదటి సెషన్, అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్‌ 15 నుంచి జులై 31 వరకు అన్ని పని దినాల్లో హెల్ప్‌ డెస్క్‌ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. మొత్తం 150 మార్కులకు టెట్ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే అంతిమంగా పరిగణనలోకి తీసుకుంటారు. టెట్ స్కోర్‌కు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న టీచర్లకు కూడా టెట్‌ తప్పనిసరి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
రిలయన్స్ జోరు.. కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!
రిలయన్స్ జోరు.. కేవలం 4 రోజుల్లో రూ. 1.39 లక్షల కోట్ల లాభం!
శుక్రుడితో లక్ష్మీ యోగం! ఆ రాశుల వారికి సిరిసంపదలు ఖాయం..!
శుక్రుడితో లక్ష్మీ యోగం! ఆ రాశుల వారికి సిరిసంపదలు ఖాయం..!
చనిపోయిన భర్త కల నెరవేర్చిన టాలీవుడ్ హీరోయిన్.. బ్యూటిఫుల్ వీడియో
చనిపోయిన భర్త కల నెరవేర్చిన టాలీవుడ్ హీరోయిన్.. బ్యూటిఫుల్ వీడియో
టెట్‌ 2026కు భారీగా తగ్గిన దరఖాస్తులు.. పరీక్షలు ఎప్పుడంటే?
టెట్‌ 2026కు భారీగా తగ్గిన దరఖాస్తులు.. పరీక్షలు ఎప్పుడంటే?
సెప్టెంబర్ 8 నుండి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్! మీ ఫోన్ కూడా ఉందా?
సెప్టెంబర్ 8 నుండి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్! మీ ఫోన్ కూడా ఉందా?
తమిళనాడు సీఎం స్టాలిన్ ఘోర పరాజయం..
తమిళనాడు సీఎం స్టాలిన్ ఘోర పరాజయం..
టీవీకే విజయంపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఏమన్నారంటే..
టీవీకే విజయంపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఏమన్నారంటే..
నాలుగు గ్రహాల కటాక్షం.. అదృష్టం వారి తలుపు తట్టే ఛాన్స్..!
నాలుగు గ్రహాల కటాక్షం.. అదృష్టం వారి తలుపు తట్టే ఛాన్స్..!
ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలు ఏవి? భారతదేశం ఎక్కడ?
ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలు ఏవి? భారతదేశం ఎక్కడ?
ఓటమి దిశగా డీఎంకే పార్టీ.. వెక్కివెక్కి ఏడ్చిన కార్యకర్త
ఓటమి దిశగా డీఎంకే పార్టీ.. వెక్కివెక్కి ఏడ్చిన కార్యకర్త