TG Inter Result Date 2026: ఈ వారంలోనే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు!
రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫస్ట్, సెంకడ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల 2026 సమాధాన పత్రాల మూల్యాంకనం మార్చి 30తో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో మూల్యాంకనం ముగియడంతో ఫలితాల క్రోడీకరణ పనుల్లో అధికారులు మునిగిపోయారు. ఈ ప్రక్రియను ఏప్రిల్ రెండో వారం నాటికి..

హైదరాబాద్, ఏప్రిల్ 6: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెంకడ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల 2026 సమాధాన పత్రాల మూల్యాంకనం మార్చి 30తో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో మూల్యాంకనం ముగియడంతో ఫలితాల క్రోడీకరణ పనుల్లో అధికారులు మునిగిపోయారు. ఈ ప్రక్రియను ఏప్రిల్ రెండో వారం నాటికి పూర్తి చేసి.. ఏప్రిల్ 12 నాటికి ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. అంతా సవ్యంగా జరిగితే అంతకంటే ముందే అంటే ఏప్రిల్ 10వ తేదీనే ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. లేదంటే ఏప్రిల్ 12వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిజానికి తొలుత ఏప్రిల్ 6న అంటే ఈ రోజు ఫలితాలు విడుదల చేయాలనుకున్నప్పటికీ బడ్జెట్ సమావేశాలు ఇతర పనులతో రెండో వారానికి వాయిదా వేశారు.
కాగా ఈ ఏడాది తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి ఈ ఏడాది మొత్తం 9 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు 4 లక్షల మంది, సెకండ్ ఇయర్ విద్యార్ధులు 5 లక్షల మంది ఉన్నారు. వీరంతా ప్రస్తుతం ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. స్పాట్ వాల్యూయేషన్ ప్రాసెస్ పూర్తి కావటంతో మార్కుల ప్రాసెస్ ప్రక్రియ కొనసాగుతోంది. మార్కుల ఎంట్రీ, సాంకేతిక అంశాలు, ఫలితాల క్రోడీకరణ ప్రస్తుతం తది దశలో ఉన్నాయి. రెండు మూడు రోజుల్లో ఇవన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది.
ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీల మధ్యలో ఫలితాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వ అనుమతి తీసుకొని ఫలితాల విడుదలకు తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఒకేసారి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు వెల్లడిస్తారు. ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు నుంచి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




