జూన్ 15 నుంచి బడులు రీ-ఓపెన్‌.. ఈ ఏడాది అకడమిక్ క్యాలెండర్‌లో సరి కొత్త మార్పులు

తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాచారం అందించింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన పాఠశాల అకడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ విభాగం అధికారికంగా విడుదల చేసింది. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వర్తించేలా ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఈ ఉత్తర్వులను జారీ చేశారు..

జూన్ 15 నుంచి బడులు రీ-ఓపెన్‌.. ఈ ఏడాది అకడమిక్ క్యాలెండర్‌లో సరి కొత్త మార్పులు
Telangana Academic Calendar

Edited By:

Updated on: Jun 07, 2026 | 5:01 PM

హైదరాబాద్, జూన్ 7: నూతన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది పాఠశాలల్లో పలు ఆసక్తికరమైన మార్పులతో పాటు, పరీక్షలు, సెలవుల షెడ్యూల్‌ను ప్రభుత్వం ముందుగానే ఖరారు చేసింది. వేసవి సెలవుల అనంతరం జూన్ 15, 2026 నుండి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 227 పనిదినాలు ఉంటాయి. ఏప్రిల్ 23, 2027 విద్యాసంవత్సరపు చివరి పనిదినంగా ఉంటుంది. ఏప్రిల్ 24, 2027 నుండి జూన్ 13, 2027 వరకు వేసవి సెలవులుగా ప్రకటించారు. అక్టోబర్ 10, 2026 నుండి అక్టోబర్ 22, 2026 వరకు మొత్తం 13 రోజులు దసరా సెలవులు ఉంటాయి. జనవరి 13, 2027 నుండి జనవరి 17, 2027 వరకు 5 రోజులు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 23 నుండి 27 వరకు 5 రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు పరీక్షల తేదీలను కూడా ముందే ఖరారు చేశారు.

ఈ ఏడాది నిర్వహించే పరీక్షల తేదీలు

  • ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (FA 1): జూలై 31, 2026 లోపు
  • ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (FA 2): సెప్టెంబర్ 21, 2026 లోపు. సమ్మేటివ్ అసెస్‌మెంట్ (SA 1): అక్టోబర్ 1, 2026 నుండి అక్టోబర్ 9, 2026 వరకు నిర్వహించేలా ప్లాన్ చేశారు.
  • ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (FA 3): డిసెంబర్ 10, 2026 లోపు.
  • ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (FA 4):పదో తరగతి వారికి జనవరి 27, 2027 లోపు.. 1 నుండి 9 తరగతుల వారికి ఫిబ్రవరి 15, 2027 లోపు నిర్వహిస్తారు. ప్రీ-ఫైనల్ 10వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 28, 2027 లోపు పూర్తి చేయాలి. ఎస్సెస్సీ బోర్డు వార్షిక పరీక్షలు మార్చి, 2027 లో జరుగుతాయి.

హైస్కూళ్ళు, అప్పర్ ప్రైమరీ పాఠశాలలు ఉదయం 09:00 నుండి సాయంత్రం 04:15 వరకు, అవే స్కూల్స్ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉదయం 08:45 నుండి సాయంత్రం 04:00 వరకు ఉంటాయి. ప్రైమరీ స్కూళ్ళు (1 నుండి 5 తరగతులు వరకు ఉదయం 09:00 నుండి సాయంత్రం 04:00 వరకు, జంట నగరాల్లో ఉదయం 08:45 నుండి సాయంత్రం 03:45 వరకు పని జరుగుతాయి. ఒంటిపూట బడులు మార్చి 15, 2027 నుండి ఏప్రిల్ 23, 2027 వరకు తాత్కాలికంగా ఉదయం 07:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు నడుస్తాయి. 10వ తరగతి సిలబస్‌ను జనవరి 10, 2027 లోపు, 1 నుండి 9 తరగతుల సిలబస్‌ను ఫిబ్రవరి 28, 2027 లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల 3వ శనివారం నాడు నో బ్యాగ్ డే అనగా మొత్తం 10 రోజుల పాటు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తారు.

Follow Us