TG Law CET 2025 Schedule: తెలంగాణ లా సెట్, పీజీఎల్‌సెట్ షెడ్యుల్ విడుదల.. పరీక్ష తేదీ ఇదే!

2025-26 విద్యా సంవత్సరానికి మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ఈ ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌లను శనివారం (ఫిబ్రవరి 8) జారీ చేసింది. మొత్తం 3 షిఫ్టుల్లో ఒకటే రోజున ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌లో పేర్కొంది..

TG Law CET 2025 Schedule: తెలంగాణ లా సెట్, పీజీఎల్‌సెట్ షెడ్యుల్ విడుదల.. పరీక్ష తేదీ ఇదే!
TG Law CET 2025 Schedule

Updated on: Feb 08, 2025 | 5:25 PM

హైదరాబాద్, ఫిబ్రవరి 8: రాష్ట్రంలోని లా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి లా కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ లాసెట్‌ 2025, పీజీఎల్‌సెట్‌ 2025 షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి శనివారం (ఫిబ్రవరి 8) విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. లాసెట్, పీజీలాసెట్‌ నోటిఫికేషన్లు ఫిబ్రవరి 25వ తేదీని విడుదలకానున్నాయి. గత ఏడాది తెలంగాణ లా సెట్, పీజీఎల్‌సెట్‌ నోటిఫికేషన్‌లు ఫిబ్రవరి 28, 2024న విడుదలైన సంగతి తెలిసిందే.

ఇక ఈ ఏడాదికి లాసెట్, పీజీలాసెట్‌లకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు మార్చి 1, 2025 నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించకుండా దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఆలస్య రుసుముతో మే 25, 2025వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇక లాసెట్, పీజీఎల్‌సెట్‌ పరీక్షలు జూన్‌ 6, 2025వ తేదీన మొత్తం 3 షిఫ్టుల్లో ఒకటే రోజున ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి.

తెలంగాణ లా సెట్, పీజీఎల్ సెట్ షెడ్యుల్ 2025 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మొదటి షిఫ్టు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ఉంటుంది. రెండో షిఫ్టు మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు ఉంటుంది. ఇక మూడో షిప్టు సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు ఉంటుంది. కాగా మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఉన్నత విద్యామండలి ఈ ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌లను జారీ చేసింది. విద్యార్హతలు, పరీక్ష విధానం, ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రాసెస్‌, ఎగ్జాం సెంటర్స్‌, ర్యాంకింగ్‌, సిలబస్‌ వంటి ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

తెలంగాణ ఈసెట్ 2025 షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఉన్నత విద్యామండలి 2025-26 విద్యా సంవత్సరానికి బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈసెట్‌ 2025 షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం.. ఈసెట్ నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 25న విడుదలవనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 19, 2025 వరకు కొనాసాగుతాయి. ఇక ఆన్‌లైన్‌లో జరిగే ఈసెట్ పరీక్ష మే 12, 2025వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది.

తెలంగాణ ఈసెట్ 2025 షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us