విద్యార్ధులకు అలర్ట్.. నేటితో ముగిసిన వేసవి సెలవులు! రేపట్నుంచి తరగతులు షురూ

సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం సోమవారం (జూన్‌ 1) నుంచి జూనియర్‌ కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఇక ఒకటి నుంచి 10వ తరగతి వరకు విద్యార్ధులకు జూన్‌ 12 నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి..

విద్యార్ధులకు అలర్ట్.. నేటితో ముగిసిన వేసవి సెలవులు! రేపట్నుంచి తరగతులు షురూ
Telangana Junior Colleges Reopen From Tomorrow

Updated on: May 31, 2026 | 2:39 PM

హైదరాబాద్, మే 31: రాష్ట్ర విద్యార్ధులకు ఇంటర్ బోర్డు కీలక అప్‌డేట్ జారీ చేసింది. సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం రేపట్నుంచి ఇంటర్ కాలేజీలు తెలరచుకోనున్నాయి. ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ విద్యార్ధుల కోసం జూనియర్‌ కాలేజీల్లో సోమవారం నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. వేసవి సెలవుల అనంతరం సోమవారం (జూన్ 1) నుంచి జూనియర్‌ కాలేజీలు పునః ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అకడమిక్‌ క్యాలెండర్‌ను ఇప్పటికే విడుదల చేసింది. జూన్‌ 1 నుంచే ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ క్లాసులు ప్రారంభిస్తామని ఇంటర్‌బోర్డు అధికారులు గతంలోనే వెల్లడించారు.

మరోవైపు ఏపీలోనూ ఇంటర్ తరగతులు జూన్‌ 1వ తేదీ నుంచి ప్రారంభం కావల్సి ఉంది. అయితే మండే ఎండల తీవ్రత దృష్ట్యా వేసవి సెలవులను మరికొన్ని రోజులు పొడిగించారు. దీంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ కాలేజీలు జూన్‌ 6వ తేదీ నుంచి మొదలవనున్నాయి.

తెలంగాణ ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెన్త్ (SSC), ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన వేలాది మంది విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిషన్ నంబర్ లేదా లాగిన్ వివరాలను నమోదు చేసి మార్కులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో షెడ్యూల్ ప్రకారం పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు థియరీ, ప్రాక్టికల్ పరీక్షలను వేర్వేరు కేంద్రాల్లో నిర్వహించారు. ఓపెన్ టెన్త్ పరీక్షలు 36,863 మంది రాయగా.. ఇందులో 26,542 మంది (72 శాతం) పాస్ అయ్యారు. ఇక ఓపెన్ ఇంటర్ పరీక్షలు 54,679 రాయగా.. ఇందులో 37, 562 మంది (68.70 శాతం) పాస్ అయ్యారు. జూన్ 2 నుంచి 7 వరకు రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి రీకౌంటింగ్ ఫీజు రూ.350, ఇంటర్‌కు రూ.400గా నిర్ణయించారు.

తెలంగాణ ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ ఫలితాల 2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us