తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026 ఎప్పుడు విడుదల? TS Inter Results Date పూర్తి వివరాలు

Telangana Inter Results 2026: మార్చి 4 నుంచే పరీక్ష పత్రాల వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వీలైనంత త్వరగా పరీక్ష పత్రాలను దిద్దే పని పూర్తి చేసి.. ఆ వెంటనే ఫలితాలు ప్రకటించేందుకు అధికారులు తగిన విధంగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ మొదటి వారంలోనే ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026 ఎప్పుడు విడుదల? TS Inter Results Date పూర్తి వివరాలు
Telangana Inter Results

Edited By:

Updated on: Apr 12, 2026 | 11:31 AM

ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఏప్రిల్ 10 లోపు ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ 4 లేదా 5వ తేదీనాడు ఫలితాలు ప్రకటించాలని బోర్డు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 18తో ముగియనున్నాయి. పరీక్షలు జరుగుతుండగానే.. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను కూడా ఇంటర్మీడియట్ బోర్ట్ నిర్వహిస్తోంది.

ఇప్పటికే ప్రారంభమైన వాల్యుయేషన్

మార్చి 4 నుంచే పరీక్ష పత్రాల వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వీలైనంత త్వరగా పరీక్ష పత్రాలను దిద్దే పని పూర్తి చేసి.. ఆ వెంటనే ఫలితాలు ప్రకటించేందుకు అధికారులు తగిన విధంగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ మొదటి వారంలోనే ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. మూల్యాంకనంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే తప్ప పరీక్ష ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు ఏప్రిల్ మొదటి వారంలో లేదా రెండో వారంలోనే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

విద్యార్థులకు ఇబ్బంది లేకుండా..

మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ సహా ఇతర పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రవేశాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదనే ఉద్దేశంతోనే బోర్డ్ ఇంటర్ ఫలితాలను త్వరగా విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తోంది. గత సంవత్సరం కంటే వేగంగా ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డ్ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి

Follow Us