AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GPO Job Notification 2025: రెండో విడత జీపీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీ ఇదే

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామ పాలన అధికారుల (జీపీవో) పోస్టుల భర్తీకి మరోమారు రెవెన్యూశాఖ సమాయాత్తమవుతోంది. ఇందులో భాగంగా తాజాగా రెండో విడతగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 29న రెవెన్యూ శాఖ మొదటి నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద..

GPO Job Notification 2025: రెండో విడత జీపీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీ ఇదే
Telangana GPO Jobs
Srilakshmi C
|

Updated on: Jul 11, 2025 | 8:46 AM

Share

హైదరాబాద్‌, జులై 11: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామ పాలన అధికారుల (జీపీవో) పోస్టుల భర్తీకి మరోమారు రెవెన్యూశాఖ సమాయాత్తమవుతోంది. ఇందులో భాగంగా తాజాగా రెండో విడతగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 29న రెవెన్యూ శాఖ మొదటి నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 10,954 జీపీవో పోస్టులను భర్తీ చేసింది. గతంలో వీఆర్‌ఏ, వీఆర్‌వో పోస్టులకు ఎంపికైన వారికి అవకాశం కల్పించింది. ఇందులో ఐదు వేల మంది దరఖాస్తు చేసుకోగా 3,550 మంది జీపీవోలుగా ఎంపియ్యారు.

మిగతా ఖాళీల భర్తీకి కూడా వీఆర్‌ఏ, వీఆర్వోలకు అవకాశం ఇచ్చేందుకు రెవెన్యూశాఖ మరో నోటిఫికేషన్‌ జారీ చేసింది. మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని ఇటీవల రెవెన్యూ సంఘాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరగా.. ఈ మేరకు మిగిలిన ఖాళీల భర్తీకి భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టులకు వీఆర్‌ఏ, వీఆర్వోలు ఆన్‌లైన్‌ ద్వారా జులై 16, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

జులై 27న లైసెన్స్‌డ్‌ సర్వేయర్లతో కలిపి పరీక్ష

గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌లో జీపీవోల ఎంపికకు అర్హత పరీక్ష నిర్వహించారు. ఈ సారి కూడా అర్హత పరీక్ష ద్వారానే వీరిని ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను జులై 27న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు కూడా ఈ రాత పరీక్ష రాయాల్సి ఉంది. ఈ క్రమంలో జీపీవోలు, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు కలిపి ఒకేసారి పరీక్ష నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..