TG EAPCET 2026 Results: టీజీ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల తేదీ వచ్చేసిందోచ్‌.. మరో 10 రోజుల్లోనే రిజల్ట్స్

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీజీ ఈఏపీసెట్‌ 2026) ఫలితాలు మరో 10 రోజుల్లోగా విడుదల కానున్నాయి. ఈ మేరకు ఫలితాల విడుదల తేదీని ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు మే 26వ తేదీన ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి..

TG EAPCET 2026 Results: టీజీ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల తేదీ వచ్చేసిందోచ్‌.. మరో 10 రోజుల్లోనే రిజల్ట్స్
TG EAPCET Result date and Time

Updated on: May 13, 2026 | 6:44 PM

హైదరాబాద్‌, మే 13: తెలంగాణ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీజీ ఈఏపీసెట్‌ 2026) ఫలితాలు మరో 10 రోజుల్లోగా విడుదల కానున్నాయి. ఈ మేరకు ఫలితాల విడుదల తేదీని ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. తాజా ప్రకటన మేరకు మే 26వ తేదీన ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈఏపీసెట్‌ అగ్రికల్చర్, ఇంజనీరింగ్‌ విభాగాలకు సంబంధించిన ఆన్సర్ కీ, మాస్టర్ ప్రశ్నపత్రాలు, రెస్పాన్స్‌షిట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ ప్రిలిమినరీ కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే మే 14 ఉదయం 11 గంటల వరకు ఆన్‌లైన్‌ విధానంలో సమర్పించవచ్చు. నేటితో అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యంతరాల గడువు ముగిసింది.

టీజీ ఈఏపీసెట్‌ 2026 ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా అభ్యంతరాలు లేవనెత్తాలనుకునే విద్యార్థులు ప్రతి ప్రశ్నకు రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రాథమిక కీపై చేసిన అభ్యంతరం సరైనదైతే, ఫలితాలు వెలువడిన తేదీ నుంచి ఏడు రోజులలోపు ఆ మొత్తాన్ని రిఫండ్‌ చేస్తారు. ప్రాథమిక కీలపై వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించి తుది ఆన్సర్‌ కీని విడుదల చేస్తుంది. అనంతరం తుది ఫలితాలు, ర్యాంకులు వెలువడతాయి.

ఇవి కూడా చదవండి

కాగా రాష్ట్రంలో ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగం పరీక్షలు మే 4, 5 తేదీలలో నిర్వహించగా మొత్తం 90,977 మంది విద్యార్థులకుగానూ 84,954 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్‌ పరీక్షలు మే9 నుంచి 11 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో జరిగాయి. ఈ పరీక్షకు 2,10,766 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1,97,241 మంది హాజరయ్యారు. వీటికి సంబంధించిన ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్నపత్రం అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

టీజీ ఈఏపీసెట్‌ 2026 ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us