AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Engineering Seats: తెలంగాణ ఇంజినీరింగ్‌ సీట్ల వివరాలు వచ్చేశాయ్.. కాలేజీ వారీగా పూర్తి లిస్ట్‌ ఇదే!

ఈఏపీసెట్‌ వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆదివారం సాయంత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలు, వాటిల్లో భర్తీ చేసే సీట్ల వివరాలను వెల్లడించింది. తాజా ప్రకటన మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా..

Engineering Seats: తెలంగాణ ఇంజినీరింగ్‌ సీట్ల వివరాలు వచ్చేశాయ్.. కాలేజీ వారీగా పూర్తి లిస్ట్‌ ఇదే!
Telangana Engineering Seats
Srilakshmi C
|

Updated on: Jul 07, 2025 | 8:33 AM

Share

హైదరాబాద్‌, జులై 7: తెలంగాణ ఈఏపీసెట్‌ వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆదివారం సాయంత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలు, వాటిల్లో భర్తీ చేసే సీట్ల వివరాలను వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 171 ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉన్నాయని, వీటిల్లో 1,07,218 సీట్లు ఉన్నట్లు వెల్లడించింది. వీటిల్లో కన్వీనర్‌ కోటా కింద దాదాపు 70 శాతం సీట్లు అంటే 76,795 సీట్లు భర్తీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రత్యేక జాబితాను విడుదల చేసింది.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు జులై 8వ తేదీ ఆఖరి గడువు అని తెలిపింది. ఇప్పటికే అడ్మిషన్ల కోసం 95,654 మంది ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకున్నట్లు తెలంగాణ సాంకేతిక విద్య కమిషనర్‌, టీజీ ఈఏపీసెట్‌ కన్వీనర్‌ ఎ. శ్రీదేవసేన తెలిపారు. 76,494 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైనట్లు వెల్లడించారు. మరోవైపు ఆదివారం సాయంత్రం ప్రారంభమైన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ జులై 10 వరకు కొనసాగనుంది. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ కు సంబంధించి కన్వీనర్‌ కోటాలో బ్రాంచ్‌ల వారీగా అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్ల వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

నేడే తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల.. ఎన్ని గంటల కంటే?

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఐసెట్‌ 2025) ఫలితాలు సోమవారం (జులై 7) విడుదల కానున్నాయి. ఈ మేరకు ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఐసెట్‌ పరీక్ష ప్రాథమిక కీ జూన్‌లో విడుదల చేయగా.. జూన్‌ 26 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. దీనిపై తుది కీ రూపొందించిన ఉన్నత విద్యా మండలి ఈ మేరకు ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారా..! ఆ వీడియో నిజమేనా..
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారా..! ఆ వీడియో నిజమేనా..
ఈ ఆహారంలో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్.. బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్
ఈ ఆహారంలో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్.. బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్
మట్టి కుండ నీరు ఫ్రిజ్‌లా చల్లగా ఉండాలా? ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండ
మట్టి కుండ నీరు ఫ్రిజ్‌లా చల్లగా ఉండాలా? ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండ
పెరుగు vs మజ్జిగ.. వేసవిలో మీ పొట్టకు ఏది బెస్ట్?
పెరుగు vs మజ్జిగ.. వేసవిలో మీ పొట్టకు ఏది బెస్ట్?
ఇంట్లో ఈ ఒక్కటి ఉంటే చాలు.. ఏ మంత్ర తంత్రాలు మీపై పనిచేయవ్
ఇంట్లో ఈ ఒక్కటి ఉంటే చాలు.. ఏ మంత్ర తంత్రాలు మీపై పనిచేయవ్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది..
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది..
రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?
రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?
రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా ఉంటోందా? ఈ ఆరోగ్య కారణాలే
రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా ఉంటోందా? ఈ ఆరోగ్య కారణాలే
మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు
మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్