స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో రైల్వేలో ఉద్యోగాలు.. టెన్త్‌, ఇంటర్‌ పాసైతే చాలు!

దక్షిణ పశ్చిమ రైల్వే (South Western Railway) పరిధిలోని రైల్ వీల్ ఫ్యాక్టరీ (యెలహంక)లో 2026-27 సంవత్సరానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో 11 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్‌-సి, గ్రూప్‌-డి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్‌, ఇంటర్‌ లేదా ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు డిసెంబర్‌ 13, 2026లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి..

స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో రైల్వేలో ఉద్యోగాలు.. టెన్త్‌, ఇంటర్‌ పాసైతే చాలు!
South Western Railway Recruitment

Updated on: Nov 25, 2026 | 6:21 AM

దక్షిణ పశ్చిమ రైల్వే (South Western Railway) పరిధిలోని రైల్ వీల్ ఫ్యాక్టరీ (యెలహంక)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో 2026-27 సంవత్సరానికి సంబంధించి లెవల్‌-1, లెవల్‌-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్‌ 13, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు..

  • గ్రూప్‌-సీ (లెవల్‌-2) పోస్టుల సంఖ్య: 3
  • గ్రూప్‌-డీ (లెవల్‌-1) పోస్టుల సంఖ్య: 8

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా NCVT/SCVT గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. విద్యార్హతలతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థలో క్రియాశీల సభ్యులుగా ఉండాలి. జాతీయ లేదా రైల్వే స్థాయిలో రెండు ఈవెంట్లలో, రాష్ట్ర స్థాయిలో మరో రెండు ఈవెంట్లలో పాల్గొన్న అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 01 జనవరి 2027 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 13, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులను పలు దశల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన, ప్రతిభ ఆధారంగా ఎంపిక, వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌, ఇతర అభ్యర్థులు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులు (PwBD), మహిళలు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యర్థులు: రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్షకు హాజరైన జనరల్‌, ఇతర అభ్యర్థులకు బ్యాంకు ఛార్జీలు మినహాయించి రూ.400 తిరిగి చెల్లిస్తారు. రైల్వేలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న అర్హులైన స్కౌట్స్ అండ్ గైడ్స్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో పోస్టుల వారీగా విద్యార్హతలు, ఎంపిక విధానం, ఇతర నిబంధనలను పూర్తిగా పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి

దక్షిణ పశ్చిమ రైల్వే ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us