RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తు లింక్‌ ఇదే

దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఈ సారి ఏకంగా 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు వెల్లడిస్తూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) తాజాగా షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల..

RRB Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తు లింక్‌ ఇదే
RRB Assistant Loco Pilot Jobs

Updated on: Mar 16, 2026 | 2:18 PM

హైదరాబాద్‌, మార్చి 16: నిరుద్యోగులకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఈ సారి ఏకంగా 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు వెల్లడిస్తూ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) తాజాగా షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 15 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులను జూన్‌ 14, 2026వ తేదీ వరకు స్వీకరించనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు ఐటీఐ లేదా మెకానికల్‌/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ల ఏదా బీఈ/బీటెక్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్షలు, మెడికల్‌ పరీక్షలు, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.

ఈ పోస్టులను అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.. ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో భర్తీ చేయనున్నారు. ఎంపిక ప్రక్రియ, రాత పరీక్ష సిలబస్‌, అర్హతలు వంటి ఇతర వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

ఆర్‌ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us