
హైదరాబాద్, ఫిబ్రవరి 11: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో ఆర్‌ఆర్‌ఆర్ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఏఎల్‌పీ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఫిబ్రవరి 13, 16, 17, 18 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.
ఇందుకు సంబంధించి ఇటీవల సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను కూడా ఆర్‌ఆర్‌బీ విడుదల చేసింది. ఇక తాజాగా మాక్ టెస్టులను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. లాగిన్ వివరాలు నమోదు చేయకుండానే అభ్యర్ధులు ఉచితంగా ఈ టెస్టులను ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాగా ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. రాత పరీక్షలు, వైద్య పరీక్షలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగాల తుది ఎంపిక ఉంటుంది.
ఆర్‌ఆర్‌బీ లోకో పైలట్ అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బీ) ఇటీవల 22,195 లెవెల్ 1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పోస్టులున్నాయి. సికింద్రాబాద్ జోన్‌లో 1012, విశాఖ డివిజన్ ఉండే ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 803 పోస్టులు ఉన్నాయి. పదో తరగతితోపాటు ఐటీఐ ఉత్తీర్ణత ఉన్న వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెనర్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు మార్చి 2, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డీ ఉద్యోగాల ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.