ఇంటర్‌ మార్కులతో నేరుగా అంగన్‌వాడీ టీచర్‌ ఉద్యోగాలు.. సెప్టెంబర్‌ 10 వరకే అవకాశం!

రంగారెడ్డి జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. జిల్లాలోని ఏడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద..

ఇంటర్‌ మార్కులతో నేరుగా అంగన్‌వాడీ టీచర్‌ ఉద్యోగాలు.. సెప్టెంబర్‌ 10 వరకే అవకాశం!
Rangareddy Anganwadi Teacher Recruitment

Updated on: Sep 07, 2026 | 8:05 AM

తెలంగాణలోని మహిళలు, నిరుద్యోగ మహిళా అభ్యర్థులకు మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. జిల్లాలోని ఏడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 125 అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు సెప్టెంబర్‌ 10, 2026వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మొత్తం 15,982 అంగన్‌వాడీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు.

ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీల వివరాలు ఇవే..

  • ఆమనగల్‌లో పోస్టుల సంఖ్య: 31
  • చేవెళ్లలో పోస్టుల సంఖ్య: 29
  • హయత్‌నగర్‌లో పోస్టుల సంఖ్య: 3
  • ఇబ్రహీంపట్నంలో పోస్టుల సంఖ్య: 21
  • మహేశ్వరంలో పోస్టుల సంఖ్య: 10
  • శేరిలింగంపల్లిలో పోస్టుల సంఖ్య: 5
  • షాద్‌నగర్‌లో పోస్టుల సంఖ్య: 26

రంగారెడ్డి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దివ్యాంగ అభ్యర్థులు కూడా నిర్దేశించిన అర్హతలు, విధులు నిర్వహించే సామర్థ్యానికి సంబంధించిన నిబంధనలను పాటించాలి. అంగన్‌వాడీ టీచర్‌, అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా స్థానిక మహిళా అభ్యర్థులు అయి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో సంబంధిత వార్డులో, గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో నివసించే మహిళలు అర్హులు. అభ్యర్థులు సంబంధిత తహసీల్దార్‌ ద్వారా ధ్రువీకరించిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. నోటిఫికేషన్‌ జారీ చేసిన తేదీకి ముందు ఒక సంవత్సరంలోపు పొందిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అదేవిధంగా పోస్టుల వారీగా నిర్దేశించిన రోస్టర్‌ పాయింట్‌ (కులం/వర్గం)కు చెందిన అభ్యర్థులు మాత్రమే ఆయా పోస్టులకు అర్హులవుతారు.

అర్హులైన మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా సెప్టెంబర్‌ 10, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీని జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) చేపడుతుంది. అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి గరిష్ఠంగా 10 మార్కులు కేటాయిస్తారు. ఎంపికలో విద్యార్హత మార్కులకు వెయిటేజీ ఉంటుంది. ఇంటర్మీడియట్‌లో సాధించిన మార్కులకు 70 శాతం, వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయిస్తారు.

రంగారెడ్డి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us