NIT Warangal Jobs: గేట్‌ స్కోర్‌ ఆధారంగా.. బీఈ/బీటెక్‌ అభ్యర్ధులకు వరంగల్‌ నిట్‌లో ఉద్యోగాలు..

|

Feb 28, 2022 | 7:51 AM

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT Warangal).. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టుల (JRF Vacancies) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

NIT Warangal Jobs: గేట్‌ స్కోర్‌ ఆధారంగా.. బీఈ/బీటెక్‌ అభ్యర్ధులకు వరంగల్‌ నిట్‌లో ఉద్యోగాలు..
Nit Warangal
Follow us on

NIT Warangal JRF Recruitment 2022: భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT Warangal).. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టుల (JRF Vacancies) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 2

పోస్టుల వివరాలు: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (JRF)

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వ్యాలిడ్‌ గేట్‌ స్కోర్‌ కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: అభ్యర్ధులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్: sanjaya@nitw.ac.in

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 4, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

MSME Hyderabad Jobs: బీఈ/బీటెక్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్‌.. ఎంఎస్‌ఎంఈ హైదరాబాద్‌లో ఉద్యోగాలు..