NEET SS 2026 దరఖాస్తులు ప్రారంభం.. రాత పరీక్ష ఎప్పుడంటే?

NEET SS 2026 ప్రవేశ పరీక్షకు NBEMS దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. DM, MCh, DrNB సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 18, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్‌ 11, 12 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు...

NEET SS 2026 దరఖాస్తులు ప్రారంభం.. రాత పరీక్ష ఎప్పుడంటే?
NEET SS Exam Dates

Updated on: Oct 30, 2026 | 2:52 PM

హైదరాబాద్‌, అక్టోబర్ 30: సూపర్‌ స్పెషాలిటీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వైద్య అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (NBEMS) నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ (NEET-SS) 2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్‌ 18, 2026 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్‌ 29న NBEMS పరీక్షల షెడ్యూల్‌తో పాటు ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, దరఖాస్తు విధానం, పరీక్షకు సంబంధించిన మార్గదర్శకాలను పూర్తిగా పరిశీలించాలని సూచించింది.

NEET-SS అంటే ఏమిటి?

NEET-SS అనేది సూపర్‌ స్పెషాలిటీ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష. ఈ పరీక్ష ద్వారా డాక్టరేట్‌ ఆఫ్‌ మెడిసిన్‌ (DM), మాస్టర్‌ ఆఫ్‌ చిరుర్జియే (MCh), డాక్టరేట్‌ ఆఫ్‌ నేషనల్‌ బోర్డ్‌ (DrNB) సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. NEET-SS 2026 పరీక్షను కంప్యూటర్‌ ఆధారిత విధానంలో (CBT) నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో డిసెంబర్‌ 11, 12 తేదీల్లో పరీక్ష జరగనుంది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను డిసెంబర్‌ 7న విడుదల చేయనున్నారు.

NEET-SS 2026 ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ: అక్టోబర్‌ 29, 2026.
  • దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్‌ 18, 2026.
  • అడ్మిట్‌ కార్డుల విడుదల: డిసెంబర్‌ 7, 2026.
  • ప్రవేశ పరీక్ష తేదీలు: డిసెంబర్‌ 11, 12, 2026.
  • ఫలితాల ప్రకటన: జనవరి 12, 2027 నాటికి

NEET-SS 2026కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • అభ్యర్థులు కింది సూచనలను అనుసరించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ముందుగా NBEMS అధికారిక వెబ్‌సైట్‌ ను సందర్శించాలి.
  • వెబ్‌సైట్‌లోని పరీక్షల విభాగంలో NEET-SS 2026 లింక్‌ను ఎంచుకోవాలి.
  • రిజిస్ట్రేషన్‌ లింక్‌పై క్లిక్‌ చేసి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి.
  • వ్యక్తిగత, విద్యార్హతలకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలి.
  • సూచించిన విధంగా అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాలి.
  • నిర్ణీత పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
  • దరఖాస్తును సమర్పించిన తర్వాత కన్ఫర్మేషన్‌ పేజీని డౌన్‌లోడ్‌ చేసుకుని భద్రపరచుకోవాలి.
  • దరఖాస్తు సమర్పించే ముందు నమోదు చేసిన వివరాలన్నింటినీ మరోసారి పరిశీలించుకోవాలి. ఎలాంటి తప్పులు లేకుండా చూసుకున్న తర్వాతే ఫైనల్‌ సబ్మిట్‌ చేయాలి.

NEET-SS 2026 పరీక్షకు సంబంధించి NBEMS ప్రకటించిన సమాచారం ప్రకారం ఒక్కో గ్రూప్‌కు దరఖాస్తు ఫీజు రూ.3,500గా నిర్ణయించారు. ఫీజు చెల్లింపు విధానం, ఇతర నిబంధనల కోసం అధికారిక ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌ను పరిశీలించాలి. NEET-SS 2026 పరీక్షను కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో మార్కుల కేటాయింపు ఇలా ఉంటుంది. సరైన సమాధానానికి 4 మార్కులు, తప్పు సమాధానానికి 1 మార్కు కోత చొప్పున కోత విధిస్తారు. సమాధానం రాయని ప్రశ్నకు ఎలాంటి మార్కులు ఉండవు. పరీక్ష పూర్తి విధానం, గ్రూపుల వారీగా వివరాలు, ఇతర మార్గదర్శకాల కోసం అభ్యర్థులు అధికారిక సమాచార బులెటిన్‌ను చదవాలి. NEET-SS 2026కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నవంబర్‌ 18లోగా ఆన్‌లైన్‌ ప్రక్రియను పూర్తి చేయాలి. అర్హతలు, ఇతర నిబంధనలపై పూర్తి వివరాల కోసం NBEMS అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ఇవి కూడా చదవండి

నీట్‌ 2026 సూపర్‌ స్పెషాలిటీ ప్రవేశ పరీక్ష రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us